పోలీస్ ఆఫీసర్ గా డ్రగ్స్ మాఫియాని చేజింగ్ చేస్తున్న వరలక్ష్మి

సౌత్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని సినిమాలు చేస్తుంది.

 Varalaxmi Sarathkumar Play Police Officer Role In Chasing-TeluguStop.com

తమిళ్ లో పందెంకోడి2, విజయ్ సర్కార్ సినిమాలలో పవర్ ఫుల్ విలన్ గా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగోట్టింది.తరువాత తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా డిజాస్టర్ అయిన రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో మెస్మరైజ్ చేసింది.మరో వైపు అల్లరి నరేష్ నాంది సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా కనిపించి మెప్పించింది.

 Varalaxmi Sarathkumar Play Police Officer Role In Chasing-పోలీస్ ఆఫీసర్ గా డ్రగ్స్ మాఫియాని చేజింగ్ చేస్తున్న వరలక్ష్మి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ప్రస్తుతం వరలక్ష్మికి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి.చిరంజీవి లూసీఫర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర కోసం ఈమెని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరో వైపు స్టార్ హీరోల సినిమాల కోసం వరలక్ష్మిని విలనీ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలనీ పాత్రలు చేస్తూనే మరో వైపు లేడీ ఒరియాంటెడ్ సినిమాలతో ఈ భామ దూసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగంగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేజింగ్ అనే సినిమాలో నటిస్తుంది.డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపే పవర్ ఫుల్ ఆఫీసర్ గా ఆమె ఈ సినిమాలో కనిపించబోతుంది.

కేకే కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు, తమిళ్ బాషలలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

#Chasing #Kollywood #Police Officer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు