వరలక్ష్మి స్టైలే వేరబ్బ  

Varalaxmi Sarathkumar Pens Down An Emotional Note Completes 25 Films-eight Years Film Carrier,emotional Note,varalaxmi Sarathkumar,వరలక్ష్మి

తమిళ స్టార్‌ హీరోయిన్‌ వరలక్ష్మి హీరోయిన్‌గా తన 25 చిత్రాలను పూర్తి చేసుకుంది.ఈమె హీరోయిన్‌గా 25 చిత్రాలు పూర్తి చేసుకుంది అనే కంటే నటిగా ఈమె 25 చిత్రాలు పూర్తి చేసుకుంది అంటే బాగుంటుంది.

Varalaxmi Sarathkumar Pens Down An Emotional Note Completes 25 Films-Eight Years Film Carrier Emotional Varalaxmi వరలక్ష్మి

ఎందుకంటే ఈమె కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా నటించిన విషయం తెల్సిందే.మంచి పాత్రల్లో నటించి నటిగా స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకున్న వరలక్ష్మి ఇండ్రస్టీకి 2012 వ సంవత్సరంలో పరిచయం అయ్యింది.

వరలక్ష్మి ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లు అయిన సందర్బంగా ఎమోషనల్‌గా స్పందించింది.నా ఈ జర్నీలో ఎంతో మంది సాయంగా నిలిచారు.

కొందరు నన్ను కిందకు లాగేందుకు ప్రయత్నించారు.వారందరికి కూడా నా కృతజ్ఞతలు.నాకు సాయం చేసిన వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.అలాగే నన్ను కిందుకు లాగేందుకు ప్రయత్నించడం వల్ల నేను మానసికంగా చాలా బలంగా మారాను అంటూ ఆసక్తికరంగా ఈ అమ్మడు వ్యాఖ్యలు చేసింది.

తమిళ స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ మొదటి భార్య కుమార్తె అయిన వరలక్ష్మి ప్రస్తుతం తండ్రికి చాలా క్లోజ్‌గానే ఉంటుంది.తన పేరుకు చివర్లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అంటూ జత చేసుకుంటుంది.

అయితే తండ్రి పేరును వాడుకుని ఎప్పుడు కూడా ఈమె అవకాశాల కోసం అర్రులు చాచింది లేదు అంటూ సినీ వర్గాల వారు ఈమెపై ప్రశంసలు కురిపిస్తారు.ఈమె చాలా గొప్ప నటిగా భవిష్యత్తులో పేరు దక్కించుకుంటుందని అంటున్నారు.

.

తాజా వార్తలు

Varalaxmi Sarathkumar Pens Down An Emotional Note Completes 25 Films-eight Years Film Carrier,emotional Note,varalaxmi Sarathkumar,వరలక్ష్మి Related....