నాంది కోసం సాఫ్ట్ గా మారిపోయిన లేడీ విలన్ వరలక్ష్మి  

Varalaxmi Sarathkumar First Look Reveal In Naandi Movie - Telugu Allari Naresh, Naandi Movie, Tollywood, Varalaxmi Sarathkumar First Look

సౌత్ ఇండియాలో ఇప్పుడు లేడీ విలన్ అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు వరలక్ష్మి శరత్ కుమార్.తన వైల్డ్ పెర్ఫార్మెన్స్ లేడీ విలన్ గా తమిళంలో ఇప్పటికి విజయ్, విశాల సినిమాలలో నటించి మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు తెలుగులో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

Varalaxmi Sarathkumar First Look Reveal In Naandi Movie

అందరూ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వరలక్ష్మి మాత్రం తనకి విలన్ పాత్రలే కంఫర్ట్ అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో విలన్ గా మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు రవితేజ కోసం మరోసారి పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారిపోయింది.

ఇప్పటికే ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర ఎలా ఉంటుందో చిత్ర యూనిట్ పరిచయం చేసేసింది.

నాంది కోసం సాఫ్ట్ గా మారిపోయిన లేడీ విలన్ వరలక్ష్మి-Movie-Telugu Tollywood Photo Image

వరలక్ష్మీ క్రాక్ తో పాటు అల్లరి నరేష్ కెరియర్ లో మొదటి డిఫరెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమాలో ఆమె పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ని పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.ఈ లుక్ లో ఇప్పటి వరకు చేసిన పాత్రలకి భిన్నంగా కంప్లీట్ గా సాఫ్ట్ లుక్ తో ఈ అమ్మడు కనిపిస్తుంది.

ఈ లుక్ బట్టి ఇందులో విలన్ పాత్ర కాకుండా సినిమాలో కీలక పాత్ర అని అర్ధమవుతుంది.విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కి ఎంత వరకు హిట్ ఇస్తుంది.

అలాగే వరలక్ష్మి ఈ సినిమా ద్వారా తనలో మరో యాంగిల్ ని ఏ రేంజ్ లో చూపిస్తుంది అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test