ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు అంటున్న వరలక్ష్మి..!

గడిచిన ఎనిమిది నెలల్లో కరోనా వైరస్ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఏవిధంగా గడగడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు కూడా మరోసారి సెకండ్ వేవ్ అంటూ కొన్ని దేశాలలో కరోనా వైరస్ మళ్లీ తిరుగుముఖం పట్టి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 Varalaxmi Sarathkumar Tweets About Mask Usage In Corona Time, Corona, Mask Uses,-TeluguStop.com

అయితే మన దేశంలో కరోనా మహమ్మారి అభివృద్ధి కొద్దిగా తగ్గడంతో చాలా మంది లైట్ తీసుకుంటున్నారు.మాస్కులు ధరించకుండా పూర్తిగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు.

కాకపోతే కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయని సంతోషించవచ్చును కానీ కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వస్తున్నాయన్న విషయాన్ని మాత్రం ప్రజలు మర్చిపోతున్నారు.ప్రస్తుతం చలికాలం.

వైరస్ విజృంభణ చేయడానికి కావలసిన సమయం ఇది.ఎంతో మంది డాక్టర్లు కూడా ఈ వైరస్ పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇంకా మందు కనిపెట్టిని ఈ మహమ్మారి నుండి రక్షణ పొందాలంటే కచ్చితంగా మాస్క్ ధరించడం, అలాగే సామాజిక దూరం పాటించడం, అలాగే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటూ ఉండాలి.ఇకపోతే తాజాగా మాస్కు ధరించకపోతే ఏం జరుగుతుందో తెలుపుతూ తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే ఇద్దరు పిల్లలు అసలు బట్టలు వేసుకోకుండా ఎదురెదురుగా నిలబడి పిస్ చేస్తున్నారు.

అలాగే మరొక ఒక చిత్రంలో ఒక వ్యక్తి ప్యాంటు వేసుకున్నారు మరొకరు పిస్ చేస్తుండడం గమనించవచ్చు.అయితే ఈ రెండో ఫోటోలో ఒక వ్యక్తి ప్యాంట్ వేసుకోవడం ద్వారా అతడు సురక్షితంగా ఉన్నాడని అర్థమవుతుంది.

అలాగే మూడో చిత్రంలో చూస్తే ఇద్దరు ప్యాంట్స్ వేసుకోవడం ద్వారా ఎవరు ఏమి చేసినా వారి ప్యాంటు మాత్రమే తడుస్తుంది అన్నట్లుగా చిత్రీకరించారు.ఈ మూడు చిత్రాలను చూపిస్తూ మనకు ప్రస్తుతం మాస్క్ ఉపయోగించడం ఎంత అవసరమో అన్నట్లుగా తెలుపుతూ.

ప్రపంచంలో ఇంత కన్నా గొప్పగా మాస్క్ ఉపయోగం గురించి ఎవరూ చెప్పలేరేమో అంటూ తన ట్వీట్ లో పేర్కొంది వరలక్ష్మి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube