రవితేజ కంటే ముందే కానిస్తోన్న జయమ్మ  

Varalaxmi Sarat Kumar Starts Dubbing For Krack, Raviteja, Krack, Varalaxmi Sarat Kumar, Gopichand Malineni, Tollywood News - Telugu Gopichand Malineni, Krack, Raviteja, Shruthi Hasan, Tollywood News, Varalaxmi Sarat Kumar, Varalaxmi Sarat Kumar Starts Dubbing For Krack

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ చివరిదశ షూటింగ్‌లో ఉండగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ యాక్షన్ డ్రామాలో రవితేజ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

TeluguStop.com - Varalaxmi Sarat Kumar Starts Dubbing For Krack

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో రవితేజతో పాటు భారీ తారాగణం నటిస్తోంది.

TeluguStop.com - రవితేజ కంటే ముందే కానిస్తోన్న జయమ్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సముత్రకని వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో జయమ్మ అనే ఊరమాస్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ రెడీ అవుతోంది.

ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసిన వరలక్ష్మీ, తాజాగా ఆమె పాత్రకు డబ్బింగ్‌ను కూడా మొదలుపెట్టిందట.ఇంకా చిత్ర హీరో రవితేజ కూడా తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టలేదని, అయినా జయమ్మ మాత్రం తన జోరును చూపిస్తూ దూసుకుపోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాతో రవితేజ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని, ఇందులో ఆయన పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం పక్కా అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

గతంలో రవితేజకు బలుపు, డాన్ శీను వంటి సూపర్ హిట్లు అందించిన గోపిచంద్, క్రాక్ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Raviteja #Krack #VaralaxmiSarat #VaralaxmiSarat #Shruthi Hasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varalaxmi Sarat Kumar Starts Dubbing For Krack Related Telugu News,Photos/Pics,Images..