ఆమె నన్ను ఇబ్బంది పెట్టింది.. సవతితల్లిపై వరలక్ష్మి కీలక వ్యాఖ్యలు..!- Varalaxmi Sarat Kumar Comments About Radhika

varalaxmi sarat kumar comments about radhika, comments about radhika, crack movie, jayamma role, varalaxmi sarat kumar - Telugu Comments About Radhika, Crack Movie, Jayamma Role, Varalaxmi Sarat Kumar

తెలుగు, తమిళ భాషల్లో నెగిటివ్ పాత్రల్లో ఎక్కువగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర వరలక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

 Varalaxmi Sarat Kumar Comments About Radhika-TeluguStop.com

అన్ని రకాల పాత్రలు పోషిస్తూ వరలక్ష్మి సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.మగవాళ్లకు ధీటైన పాత్రలను పోషిస్తూ వరలక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

క్రాక్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వరలక్ష్మీ సవతితల్లి, నటి రాధిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.రాధిక తనకు తల్లి కాదని రాధిక తనతో ఫ్రెండ్లీగా ఉంటుందని ఆమె చెప్పారు.

 Varalaxmi Sarat Kumar Comments About Radhika-ఆమె నన్ను ఇబ్బంది పెట్టింది.. సవతితల్లిపై వరలక్ష్మి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలకు సంబంధించి రాధిక ఎన్నో కీలక సూచనలు చేస్తోందని అన్నారు.అయితే సీక్రెట్ల విషయంలో రాధిక తనను చాలా ఇబ్బందులకు గురి చేసిందని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

Telugu Comments About Radhika, Crack Movie, Jayamma Role, Varalaxmi Sarat Kumar-Movie

ఎప్పుడు ఏ రహస్యం చెప్పినా రాధిక వెంటనే ఆ సీక్రెట్ ను లీక్ చేస్తుందని అన్నారు.రాధిక తన సీక్రెట్లను కావాలని లీక్ చేయకపోయినా పొరపాటున ఆ విధంగా జరిగిపోతుందని ఆమె అన్నారు.సవతి తల్లి గురించి వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ సినిమా ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ ను మొదలుపెట్టారు.

తెనాలి రామకృష్ణ సినిమా ఫ్లాప్ అయినా వరలక్ష్మి నటనకు పేరు, ప్రశంసలు దక్కాయి.కొన్నేళ్ల క్రితం హీరో విశాల్ తో ప్రేమాయణం ద్వారా వరలక్ష్మి వార్తల్లో నిలవగా కొన్ని కారణాల వల్ల వాళ్ల లవ్ జర్నీకి ఎండ్ కార్డ్ పడింది.

సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో వేర్వేరు పాత్రల్లో నటిస్తూ నటిగా వరలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.క్రాక్ సినిమా హిట్ కావడంతో భవిష్యత్తులో వరలక్ష్మికి తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

#Jayamma Role #VaralaxmiSarat #CommentsAbout

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు