శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతే... మరెప్పుడు చేయొచ్చో తెలుసుకోండి..

శ్రావణమాసంలో పూర్ణిమకు అంటే పున్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు ముత్తైదువలు.వరలక్ష్మీ వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి… పూజగదిని శుభ్రపరుచి,వ్రతం చేసుకుని ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితి.

 Varalakshmi Vratham Sravana Masam Lakshmi Pooja-TeluguStop.com

అయతే ఏదైనా అనివార్య కారణాల వలన శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం మిస్ అయితే మళ్లీ శ్రావణం వరకు ఎదురు చూడక్కర్లేదు.మరెప్పుడూ వ్రతం చేసుకోవచ్చు.ఎలా చేయాలి.మీకోసం….

శ్రావణమాసంలో వీలుకాని సందర్భంలో మాత్రమే మహిమాన్వితమైన వరలక్ష్మీవ్రతాన్ని వదలిపెట్టకుండా గృహిణులు ఆశ్వయుజమాసంలో నిర్వహించడం శుభకరమని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతాన్ని ప్రదోష సమయంలో పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పూట సాయంత్రం ప్రదోషం సమయం ముగిసిన తర్వాత లక్ష్మీ పూజ చేయడం సత్ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

శ్రావణంలో చేసిన మాదిరిగానే ఆశ్వయుజంలో కూడా శుక్రవారం రోజున తలారా స్నానం చేసి,పట్టువస్త్రాలు ధరించి,పూజగదిని శుభ్రం చేసి.శ్రీ వరలక్ష్మిని కీర్తిస్తూ.ఆవాహనం చేసిన వరలక్ష్మీని ధ్యాన ఆవాహ నాది షోడశోపచారాలతో, అష్ణోత్తరశత నామాలతో అర్చించి అనేక విధాలైన భక్ష్యాలను, పిండివంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేయబడిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకుని భక్తిగా ప్రదక్షిణ, నమస్కారాలు సమర్పించాలి.

ఇంటికొచ్చిన ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి.వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.బంగారు ఆభరణాలకు లోటుండదు.

సమస్త సంపదలు తులతూగుతాయి.కావున శ్రావణం లో చేయలేకపోతున్నామని బాదపడకుండా ఆశ్వయుజంలో వ్రతం చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షం పొందండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube