భయపెట్టడానికి రెడీ అవుతున్న జయమ్మ

లేడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ సినిమాలలో దూసుకుపోతున్న అందాల భామ వరలక్ష్మి శరత్ కుమార్.తండ్రి వారసత్వంతో సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

 Varalakshmi Signed Horror Thriller Movie In Telugu-TeluguStop.com

తరువాత విలనీ పాత్రలతో కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.ఏకంగా ఇళయదళపతి విజయ్, విశాల్ సినిమాలలో విలన్ గా నటించి మెప్పించింది.

ఇక కోలీవుడ్ లో ఈమె విలనిజానికి ఫిదా అయ్యి దర్శకుడు నాగేశ్వర రెడ్డి తెనాలి రామకృష్ణ ద్వారా తెలుగులోకి పరిచయం చేశాడు.ఈ సినిమా అంతగా వర్క్ అవుట్ కాకున్నా ఆమె పాత్ర మాత్రం అందరికి కనెక్ట్ అయ్యింది.

 Varalakshmi Signed Horror Thriller Movie In Telugu-భయపెట్టడానికి రెడీ అవుతున్న జయమ్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాలో ఆమెని జయమ్మ పాత్రలో ప్రెజెంట్ చేశాడు.ఈ పాత్రకి న్యాయం చేసి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక నాంది సినిమాలో హీరోతో సమానమైన పాత్రలో నటించి మెప్పించింది.ఈ రెండు సినిమాల సక్సెస్ తో ఇప్పుడు టాలీవుడ్ లో వరలక్ష్మి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతుంది.

ఇప్పటికే అల్లు అర్జున్, కొరటాల సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మిని ఫైనల్ చేశారు.ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం కూడా ఆమె పేరు వినిపిస్తుంది.ఇప్పుడు ఆమె లీడ్ రోల్ లో ఓ హర్రర్ మూవీ తెరకేక్కబోతుంది.హవీన్ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో డార్లింగ్ స్వామి అనే టాలెంటెడ్ దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.ఇది టాలీవుడ్ లో వచ్చే రెగ్యులర్ కామెడీ హర్రర్ లా కాకుండా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం భయపెట్టే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

వరలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసి విషెస్ చెప్పింది.

#@varusarath5 #HorrorThriller #Darling Swamy #@idhavish #Varalakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు