గత ఏడాది నుండి పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఈ ఏడది సెకండ్ వేవ్ తో మళ్ళీ విజృంభించింది.మొత్తానికి ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ వైరస్ ని తప్పించుకోవడానికి మరో మార్గం సామాజిక దూరం పాటించడం.మాస్క్ ధరించడం.
ఇక ఈ నేపథ్యంలో గత ఏడాది నుండి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.కానీ వైరస్ విజృంభణ మాత్రం తగ్గట్లేదు.
ఇప్పటికే సెకండ్ వేవ్ కూడా మరింత తీవ్రంగా ఉండటంతోపాటు తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది.మధ్యలో వైరస్ పోయినట్లే పోయి మళ్లీ విజృంభించింది.ఇక ఆ సమయంలోనే చాలా వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి తగ్గించారు.ఇక ఆ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది మళ్లీ వ్యాపించింది.
ఈ నేపథ్యంలో చాలా వరకు మాస్కులను ఒక్కో విధంగా ధరిస్తున్నారు.ఇక ఈ మాస్క్ లు ఎలా ధరించాలి అనేది ఓ ఫన్నీ వీడియో చేసి షేర్ చేసుకుంది వరలక్ష్మి.
తెలుగు సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసుకుంది.అందులో కొందరు మాస్కులు ఎలా ధరిస్తున్నారో గురించి కొంతమంది సెలబ్రెటీలతో వీడియో చేయించింది వరలక్ష్మి.అందులో వరలక్ష్మి తో పాటు ఐశ్వర్య రాజేష్, సందీప్ కిషన్, రెజీనా, యోగి బాబు పలువురు నటులు ఉండగా వారితో నిర్లక్ష్యంగా మాస్క్ ధరించే విధానాన్ని చూపించింది.
ఇక ఆ మాస్క్ ధరించడాన్ని కాస్త ఫన్నీగా చూపించగా మొత్తానికి ఆ మాస్కును ఎలా ధరించాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక అవగాహన తో కల్పించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలా మంది మాస్క్ విషయంలో చేసే పొరపాట్లను వీడియో ద్వారా మంచి అవగాహన అందించింది వరలక్ష్మి.
ఇది చూసిన నెటిజనులు తనపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.