బాలకృష్ణకి విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్... ఏ మూవీలో అంటే

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది.

 Varalakshmi Sarathkumar Villain For Balakrishna-TeluguStop.com

లాక్ డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళి వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి దర్శకుడు బోయపాటి రెడీ అవుతున్నాడు.బాలయ్య కెరియర్ లో భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ తెరకెక్కుతుంది.

వీరి ఇద్దరి కాంబినేషన్ మీద మంచి హైప్ ఉండటంతో పాటు ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాత ముందుకొచ్చాడు.ఏకంగా 60 కోట్ల వరకు ఈ మూవీ కోసం ఖర్చు చేస్తున్నట్లు బోగట్టా.

 Varalakshmi Sarathkumar Villain For Balakrishna-బాలకృష్ణకి విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్… ఏ మూవీలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Telugu Akhanda Movie, Balakrishna, Boyapati Srinu, Gopichand Malineni, Krack Movie, Tollywood, Varalakshmi Sarathkumar-Movie

ఈ మూవీ ఆగష్టులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది.తాజాగా మరో కీలక అప్డేట్ కూడా ఈ సినిమా గురించి బయటకొచ్చింది.

ఈ సినిమాలో బాలయ్యని ఎదుర్కొనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతుందనే మాట గట్టిగా వినిపిస్తుంది.గోపీచంద్ క్రాక్ మూవీలో వరలక్ష్మి విలనీగా కనిపించి మెప్పించింది.

ఇప్పుడు అంతకంటే పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య మూవీలో వరలక్ష్మి కనిపించాబోతుందని తెలుస్తుంది.బాలయ్య సినిమా అంటేనే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులు ఆశిస్తారు.

అలాగే పవర్ ఫుల్ విలనిజం కూడా కోరుకుంటారు.విలనిజం ఎంత పవర్ ఫుల్ గా ఉంటే బాలయ్య పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంటుంది.

ఈ నేపధ్యంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ అయితే పెర్ఫెక్ట్ అని దర్శకుడు గోపీచంద్ భావించి ఫైనల్ చేసినట్లు బోగట్టా.

#Boyapati Srinu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు