ఆనందంలో వరలక్ష్మి శరత్ కుమార్.. కారణం ఆ స్టార్ నటులే?

సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్.నటుడు శరత్ కుమార్ ఈమె తండ్రి.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది వరలక్ష్మి.తాజాగా ఓ స్టార్ నటుల వల్ల ఆనందంలో మునిగిపోయింది.

 Varalakshmi Sarath Kumar In Happiness Is It Beacause Of Those Star Actors-TeluguStop.com

2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.ఇక ఇటీవలే క్రాక్, నాంది సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్‘.

ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, విక్రమ్, త్రిష, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి పలువురు నటులు నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతుంది.ఇక ఇందులో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పాల్గొనగా షూటింగ్ గ్యాప్ సమయంలో వరలక్ష్మి, తన సోదరి పూజ పాల్గొన్నారు.

 Varalakshmi Sarath Kumar In Happiness Is It Beacause Of Those Star Actors-ఆనందంలో వరలక్ష్మి శరత్ కుమార్.. కారణం ఆ స్టార్ నటులే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అక్కడ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, వాళ్ల కూతురు ఆరాధ్యను కలిశారు.తాజాగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది వరలక్ష్మి.

తాను శనివారం రాత్రి ముగ్గురు మంచి వ్యక్తులను కలిశాను అంటూ.వాళ్ళు ఎవరో కాదు గ్లామర్ డాల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య అని తెలిపింది.వాళ్ళ చూపించిన ప్రేమకు ఫిదా అయ్యానని.ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అంటూ తెగ మురిసిపోయింది.ఇక వాళ్ళతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ దీనికి కారణమైన తన తండ్రికి ధన్యవాదాలు తెలిపింది.ఇక తన సోదరిని.

పూజా నువ్వు ఇంకా షాక్ నుంచి బయటకు వచ్చినట్లు లేవంటూ ఓ కామెంట్ చేసింది.

#Star Actore #Ponniyan Selvan #Sharath Kumar #Aradhya #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు