వరలక్ష్మిని రంగంలోకి దించిన ప్రశాంత్ వర్మ

హీరోయిన్ పాత్రలకి ఫుల్ స్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సత్తా చాతుతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.ఈ బ్యూటీ తమిళంలో విశాల్ పందెంకోడి, విజయ్ సర్కార్ మూవీలతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

 Varalakshmi For Prashanth Varma Hanuman, Tollywood, Zombie Reddy, Pan India Movi-TeluguStop.com

ఈ పాత్రలతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది.అయితే దీని తర్వాత తమిళంలో విలన్ గా పెద్దగా ఐడెంటిటి రాకున్న తెలుగులో మాత్రం మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

సందీప్ కిషన్ మర్యాదరామన్న సినిమాతో వరలక్ష్మి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.

Telugu Hanuman, Pan India, Prashanth Varma, Tollywood, Varalakshmi, Zombie Reddy

ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం మెయిన్ విలన్ గా వరలక్ష్మిని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ లో ఈమెని ఓ కీలకపాత్ర కోసం ఎంపిక చేశారు.

అయితే అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనా లేక మరేదైనా రోల్ లో కనిపిస్తుందా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.తేజ సజ్జా ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అవుతున్నాడు.ఇక వరలక్ష్మి హనుమాన్ మూవీలో నటిస్తుందనే టాక్ బయటకి వచ్చి అది ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube