ప్రేమ అనే ఫీలింగ్‌ వచ్చింది, వెళ్లి పోయిందట.. మరి విశాల్‌ పరిస్థితి ఏంటీ?  

తమిళ మరియు తెలుగు మీడియాలో ఎక్కువగా వినిపించే గాసిప్‌ విశాల్‌ మరియు వరలక్ష్మిలు ప్రేమలో ఉన్నారు. వీరు ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు అనే ఈ వార్తలు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే మీడియాలో ఎంతగా వార్తలు వచ్చినా కూడా వీరిద్దరు మాత్రం తమ ప్రేమ గురించిన వార్తలను కొట్టి పారేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి విశాల్‌ మరియు వరలక్ష్మిలు కలిసి ప్రేమ పుకార్లను కొట్టి పారేశారు. తాజాగా సర్కార్‌ చిత్రంలో నటించిన వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకో అడుగు ముందుకు వేసి ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చింది.

Varalakshmi About Her Love Matter With Vishal-

Varalakshmi About Her Love Matter With Vishal

తన జీవితంలో ప్రేమ అనేది వచ్చి వెళ్లి పోయిందని, ప్రేమ ఫీలింగ్‌కు లోనై ఆ సంతోషాన్ని ఎంజాయ్‌ చేశాను. కాని ఇప్పుడు ప్రేమలో లేను. ప్రేమలో పడాలనే ఆలోచన కూడా నాకు మళ్లీ లేదు. దేశంలో ఎంతో మంది మగాళ్లు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే ఆడవారు కూడా ఒంటరిగా జీవితాన్ని గడిపేయవచ్చు అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. స్త్రీకి పెళ్లి అవసరం లేదని, పెళ్లి జీవిత లక్ష్యం కావద్దని ఆడవారికి సలహా ఇచ్చింది.

జీవితంలో పెళ్లి చేసుకోను అని, తనకు మగాడి అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి నిజంగానే విశాల్‌ను పెళ్లి చేసుకోదా ఏంటీ అంటూ తమిళనాట చర్చ జరుగుతుంది. వీరిద్దరు ఎంతగా తమ మద్య ప్రేమలేదని చెబుతున్నా కూడా ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్నారు. కాని తాజాగా వరలక్ష్మి మాటలు వింటూ ఉంటే ఆమెకు పెళ్లిపై ఆసక్తి లేనట్లుగా అనిపిస్తుందని, పెళ్లి చేసుకోకుండానే ఒంటరి జీవితాన్ని గడిపేయాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నారు.

Varalakshmi About Her Love Matter With Vishal-

మరి ఈ సమయంలో విశాల్‌ పరిస్థితి ఏంటా అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండో విశాల్‌ ఖచ్చితంగా వరలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాం. కాని ఆయన ఇప్పుడు ఎవరిని చేసుకుంటాడో కదా అంటూ చర్చలు జరుగుతున్నాయి.