వారాహిపై వ్యూహం ప్రకారమే కులముద్ర కొడుతున్న వైసిపి??

చాలా రోజులుగా వార్తల్లో నిలిచిన జన సేన ప్రచార రధం వారాహి ( Varahi )ఎట్టకేలకు ప్రయాణానికి సిద్ధమవుతోంది.జూన్ 14 న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ వద్ద పూజలు చేసి యాత్ర మొదలుపెట్ట్టి ఉభయ గోదావరి జిల్లాలలో 11 నియోజకవర్గాలను కవర్ చేస్తూ భీమవరంతో ముగిసేలా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

 Varahi Schdue Fixed , Varahi , Pawan Kalyan, Ycp, Ys Jagan, 2024 Elections, Ap-TeluguStop.com

జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కంటే ఎక్కువగా వరాహి పేరు కలవరిస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు వారాహి ప్రయాణం మొదలవడంతో వ్యూహాత్మకం గానే కులముద్ర అంటించే ప్రయత్నం చేస్తున్నారు.వారాహి ప్రయాణంపై వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల( Sajjala Ramakrishna Reddy ) మాట్లాడుతూ ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తే ప్రజలు మెచ్చరంటూ వ్యాఖ్యలు చేశారు.

అంటే పవన్ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకే ఈ వారాహి ప్రయాణం మొదలు పెట్టాడని అర్థం వచ్చేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap, Chandra Babu, Pawan Kalyan, Varahi, Ys Jagan-Telugu Political News

ప్రయాణం మొదలు కాక ముందే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసేందుకే , కొన్ని వర్గాలని జనశెన కు దూరం చేసేందుకు అధికారి పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది.అయితే ఏ రాజకీయ పార్టీ అయినా తనకు బలం ఉన్నచోటే సమాయత్తమవుతుంది .బలం లేనిచోట ఎంతగా ప్రయత్నంచేసినా వృధానే,ఆ మాటకొస్తే వైసీపీ పార్టీ కూడా రాయలసీమ పై పట్టు నిలబెట్టుకోవడం కోసం నిరంతరం ప్రయత్నిస్తుంది .అలాగే జనసేన పార్టీకి( Jana sena ) ఆదరణ ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తున్న ఉపయోగ గోదావరి జిల్లాలలో వ్యూహాత్మకంగానే జనసేన పార్టీ ప్రచారాన్ని మొదలెట్టినట్లుగా తెలుస్తుంది .అయితే జనసేన బలం ఎక్కడుందో తెలుసు కాబట్టి దాని ని ఒక కులం స్థాయికి పరిమితం చేసేలా వ్యూహాత్మకమైన ఎత్తుగడలకు అధికార పార్టీ తెర తీసినట్టుగా తెలుస్తుంది.

Telugu Ap, Chandra Babu, Pawan Kalyan, Varahi, Ys Jagan-Telugu Political News

ఉభయగోదావరి జిల్లాలోను ఉత్తరాంధ్రలోనూ కీలకంగా ఉన్న జనసేన కేవలం కులానికి సంబంధించిన పార్టీ అని మిగతా సామాజిక వర్గాలలో ఒక అభిప్రాయాన్ని ఇప్పటినుంచే క్రియేట్ చేయాలనే రాజకీయ ఎత్తుగడలకు అధికార పార్టీ పాల్పడుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.మరి అధికార పార్టీ వ్యాఖ్యలను జనసేన అదికార ప్రతినిదులు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి ఏది ఏమైనా తాము ఎంతగానో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర కన్ఫామ్ అవ్వటంతో జనసేన అభిమానుల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube