వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామి ని దర్శించుకుంటారు....ఎందుకో తెలుసా?

తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవటం చూస్తూనే ఉంటాం.అలాగే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం.

 Varaha Swamy First Darshan Tirumala Why-TeluguStop.com

కానీ దానికి గల కారణం తెలియదు.మనకే కాదు మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు.

ఇప్పుడు ఆ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.

సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశారు.

అప్పటివరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి.

దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.అదేమిటంటే… తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని చెప్పాడు.

తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి స్థలం ఇవ్వటం వలన వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగి పత్రం మీద రాసి ఇచ్చారు వెంకటేశ్వర స్వామి.

ఈ రాగి రేకును అర్చన తీసుకున్న భక్తులకు ఇప్పటికి చూపిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube