వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామి ని దర్శించుకుంటారు....ఎందుకో తెలుసా?  

Varaha Swamy First Darshan Tirumala Why-

తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగవరాహస్వామిని దర్శించుకోవటం చూస్తూనే ఉంటాం.అలాగే మనం తిరుపతికవెళ్ళినప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటాం.కానీ దానికి గల కారణం తెలియదుమనకే కాదు మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు.

Varaha Swamy First Darshan Tirumala Why---

ఇప్పుడు ఆ విషయగురించి వివరంగా తెలుసుకుందాం.

సుమారు 5000 సంవత్సరాల క్రితం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిశారుఅప్పటివరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం.అప్పటిలో వరాహస్వామి వద్శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడవెంకటేశ్వరస్వామి.దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడవరాహస్వామికి.అదేమిటంటే… తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామినదర్శించుకువచ్చేలా చూస్తానని చెప్పాడు.తిరుమలలో వెలసిన తొలి దైవం వరాస్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.

వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి స్థలం ఇవ్వటం వలన వరాహస్వామికతొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగి పత్రం మీద రాసఇచ్చారు వెంకటేశ్వర స్వామి.

ఈ రాగి రేకును అర్చన తీసుకున్న భక్తులకఇప్పటికి చూపిస్తారు.