వంటలక్క ఫ్యాన్స్ ‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై దర్శనం..!

కార్తీకదీపం.తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Good News For Culinary Fans Appearance On The Silver Screen Soon Vantallaka, Karthikadeepam, Tv, Tollywood, Police, Lady Oriented Movies, Premi Viswanath,-TeluguStop.com

అందులో వంటలక్క క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్ర ప్రజలు అభిమానంతో తడిసి ముద్దవ్వడానికి.

ఒక సీరియల్ ను సినిమా రేంజ్ లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే సీరియల్ కంటెంట్ అలాంటిది మరి.మరి ఈ సీరియల్లో వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిజానికి ఈమె పూర్తిపేరు చాలామందికి తెలియదు కాకపోయినా వంటలక్క అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.

 Good News For Culinary Fans Appearance On The Silver Screen Soon Vantallaka, Karthikadeepam, Tv, Tollywood, Police, Lady Oriented Movies, Premi Viswanath, -వంటలక్క ఫ్యాన్స్ ‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై దర్శనం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేరళ రాష్ట్రానికి చెందిన ఈవిడ కు తెలుగు లో కార్తీక దీపం సీరియల్ తో తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు.

తెలుగు రాష్ట్రానికి చెందిన హీరోయిన్ లు కూడా ఈ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న వారు లేరు.తెలుగు రాష్ట్రాల్లో టిఆర్పి పరంగా చూసినా కూడా కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.

ఈ సీరియల్ దరిదాపుల్లో కూడా మరో సీరియల్ ఉండక పోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.ఇక అసలు విషయంలోకి వెళితే.బుల్లి తెర పై క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రేమ్ విశ్వనాథం త్వరలో వెండితెర పై అరంగ్రేటం చేయబోతోంది.ఈమె క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు దర్శక నిర్మాతలు ఏరికోరి వారి సినిమాల్లో ఆమెకు ఛాన్స్ లు ఇస్తున్నారు.

వంటలక్క త్వరలోనే వెండితెరపై అభిమానులను పలకరించబోతోంది.

ఇక ఈ విషయాన్ని ప్రేమి విశ్వనాథ్ స్వయంగా కన్ఫామ్ చేసిందంటే నమ్మండి.

సమాచారం మేరకు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఈవిడ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు సమాచారం.కరోనా వైరస్ వల్ల వచ్చిన లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ సమయానికి ఈ సినిమా విడుదలై కూడా ఉండేదని కాకపోతే మధ్యలో కరోనా రావడంతో ప్లాన్ చెడిపోయిందని చెప్పుకొచ్చింది ఈవిడ.

ఇప్పుడు మళ్లీ షూటింగు జరుగుతున్న నేపథ్యంలో ఆవిడ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటుంది.ఈవిడ సినిమా ఎంట్రీ కోసం వంటలక్క ఫ్యాన్స్ ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బుల్లితెరపై ఎదురులేని సక్సెస్ ను రుచి చూసిన ఈవిడ వెండితెరపై ఎలాంటి జర్నీ చేస్తుందో చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube