కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క రోల్ ను రిజెక్ట్ చేసిన నటి ఎవరో తెలుసా?

బుల్లితెరపై కొన్ని సీరియళ్లు సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతలకు కనీవిని ఎరుగని స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి.కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని ప్రేక్షకులు దాదాపుగా ఉండరు.

 Kartheekadeepam Serial Rejected Heroine Details Here Goes Viral , Kartheekadeep-TeluguStop.com

బ్లాక్ మేకప్ లో ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.వంటలక్క పాత్రలో తను తప్ప ఎవరూ నటించలేరనే స్థాయిలో ప్రేమీ విశ్వనాథ్ నటించారు.

ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ఆ సీరియల్ స్థానంలో బ్రహ్మముడి అనే సీరియల్ ప్రసారం అవుతోంది.అయితే బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ రోల్ లో నటిస్తున్న దీపిక రంగరాజు కార్తీకదీపం సీరియల్ లోని వంటలక్క పాత్రకు ఆరేళ్ల క్రితం రిజెక్ట్ చేశానని తెలిపారు.

ఆ సమయంలో ఒక తమిళ సీరియల్ తో నేను బిజీగా ఉండటం వల్ల సీరియల్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bramhamudi, Kartheekadeepam, Kavya, Serial, Serials-Movie

అయితే దీపిక రంగరాజు ఈ సీరియల్ ను రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని ప్రేమీ విశ్వనాథ్ కాకుండా ఎవరు నటించి ఉన్నా ఈ సీరియల్ ఈ రేంజ్ లో హిట్ కాదని చెబుతున్నారు.బ్రహ్మముడి సీరియల్ లో కావ్య అనే రోల్ లో ఈ నటి నటిస్తున్నారు.న్యూస్ రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దీపిక ఆ తర్వాత మోడల్ గా మారి సీరియళ్ల ద్వారా అంతకంతకూ ఎదగడం గమనార్హం.

Telugu Bramhamudi, Kartheekadeepam, Kavya, Serial, Serials-Movie

బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం కార్తీకదీపం స్లాట్ లో ప్రసారం అవుతుండగా ఈ సీరియల్ కూడా రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ ను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.దీపిక రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీని పెంచుకుంటూ వరుస ఆఫర్లతో బిజీ కావాలని భావిస్తున్నారు.ప్రేమీ విశ్వనాథ్ స్థాయిలో దీపిక తెలుగులో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube