వనిత నాలుగో పెళ్లి అంటూ వార్తలు.. ఆమె ఏమందంటే..?

గతేడాది మూడో పెళ్లి చేసుకోవడం ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.అయితే గత కొన్నిరోజులుగా వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

 Vanitha Vijaykumar Responds To Her 4th Marriage Rumours-TeluguStop.com

తాజాగా వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించిన వనితా విజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకు నాలుగో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని వనితా విజయ్ కుమార్ స్పష్టం చేయడం గమనార్హం.

వివాదాస్పద నటిగా వనితా విజయ్ కుమార్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.గతేడాది వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్న తరువాత మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారని వార్తలు వినిపించాయి.

 Vanitha Vijaykumar Responds To Her 4th Marriage Rumours-వనిత నాలుగో పెళ్లి అంటూ వార్తలు.. ఆమె ఏమందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల పీటర్ పాల్ కు నుంచి విడిపోయిన వనితా విజయ్ కుమార్ టీవీ షోలతో, సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ప్రేక్షకుల్లో తనకు ఉన్న నెగిటివ్ ఇమేజ్ ను వనితా విజయ్ కుమార్ పాజిటివ్ గా మార్చుకునే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం వనితా విజయ్ కుమార్ సింగిల్ గానే ఉన్నారు.అయితే ఒక ప్రముఖ వ్యక్తితో వనితా విజయ్ కుమార్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

తాను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె కోరారు.తన గురించి జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె సూచనలు చేశారు.

ప్రస్తుతం సింగిల్ గానే ఉండాలని తాను అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

Telugu 4th Marriage, Andhagan Movie, Relationshiop Rumours, Vanitha Vijay Kumar-Movie

వనితా విజయ్ కుమార్ స్పష్టత ఇవ్వడంతో ఇకపై ఆమె గురించి వచ్చే గాసిప్స్ ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.2k అజగనథు కాగల్, అంధాగన్ సినిమాలలో వనితా విజయ్ కుమార్ నటిస్తున్నారు.హిందీలో హిట్టైన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా అంధాగన్ తెరకెక్కుతుండటం గమనార్హం.

#4th Marriage #VanithaVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు