హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న వనితా విజయ్ కుమార్.. హీరో ఎవరంటే?

తెలుగు సినీ నటి వనిత విజయ్ కుమార్.సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఈమె తండ్రి.

 Vanitha Vijaykumar Re Entry As Heroine Romances Gold Man Hari Here Is Full Details Mnj-TeluguStop.com

వనిత తెలుగులో కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించింది.బుల్లితెరలో కూడా ఎన్నో కార్యక్రమాలలో చేసింది.

అంతేకా కుండా తమిళ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.ఇక ఈమె తన నటనా జీవితంలోకి మళ్లీ అడుగుపెట్టనున్న వార్తలు వినిపిస్తున్నాయి.

 Vanitha Vijaykumar Re Entry As Heroine Romances Gold Man Hari Here Is Full Details Mnj-హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న వనితా విజయ్ కుమార్.. హీరో ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1995లో తమిళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన వనిత విజయ్ కుమార్ ఆ తర్వాత 1997లో మలయాళంలో పరిచయమయింది.ఇక 1999లో దేవి సినిమా ద్వారా తెలుగులో పరిచయం అయింది.

ఇక వరుసగా తమిళ సినిమాలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తెలుగులో ఒక సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఈమె కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల వార్తల్లో కూడా నిలిచింది.

ఇక మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న వనిత.2కే అళగనాదు కాజల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట.ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.

ఒంటినిండా బంగారంతో బాగా పేరు సంపాదించుకున్న గోల్డ్ మ్యాన్ హరి నాదర్.తొలిసారిగా ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారట.అంతేకాకుండా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా.కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా వనిత పంచుకుంది.ఇక ఈ సినిమా పూజ అయిపోయిందంటూ, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.

ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేసింది.

#Heroine #Hari #Re-Entry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు