మీ జీవితాలు చక్కదిద్దుకోండి అంటూ ఫైర్ అయిన వనితా విజయ్ కుమార్..!

ప్రముఖ తమిళ నటి వనితా విజయకుమార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాం.తన జీవితంలో మూడోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కూడా వదిలేయడంతో ఆమెపై ఇప్పుడు మీడియా ఫోకస్ పెట్టింది.

 Actress Vanitha Vijay Kumar Fires On Social Media Comments, Vanitha Vijay Kumar,-TeluguStop.com

ఇటీవల కాలంలో ఆవిడను టార్గెట్ చేసి మాట్లాడడం పై తాజాగా వనితా విజయ్ కుమార్ మండిపడింది.తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారు ఎవరో గమనిస్తూ వారిపై ట్వీట్లతో ఎదురు దాడి చేస్తుంది ఈవిడ.

ఎవరి జీవితంలో వారు తమకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఉంటుందని ఒకరు ఎలా బ్రతకాలి అన్నది వారి ఇష్టప్రకారమే ఉండాలి కానీ వేరే వారి సలహాల పై కాదని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది.

ఎవరైనా పక్కవారి జీవితం గురించి మాట్లాడే ముందు.

ముందుగా మీ జీవితాలను సరిదిద్దుకోండి అంటూ ఆమెపై విమర్శలు చేసిన వారిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తుంది.వీటితో పాటు తాను చాలా ధైర్యవంతురాలు అని ఎలాంటి సమస్య అయినా తాను ఎదుర్కోగలనని అందుకు చాలామంది నుండి తనకు ప్రేమ, దీవెనలు నాతో ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.

వీటితోనే ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని నా పై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది.నన్ను నన్నుగా ఇష్టపడే వారితో నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తన లైఫ్ లో చోటుచేసుకున్న పరిణామాలను నేను వారికి తెలియజేస్తూ ఉంటానని తెలిపింది.

ఎవరైతే తన జీవితంపై లేనిపోని గాసిప్స్ ప్రసారం చేస్తూ.లేనిపోని ఊహాగానాలతో బతికే వారిని ఆవిడ హెచ్చరించింది.” మీ లిమిట్స్ లో మీరు ఉండండి.నా లైఫ్ కు సంబంధం లేని అవాస్తవాలను వేరే ఎవరి దగ్గరో డబ్బు తీసుకొని ప్రచారం చేయకండి” అంటూ వారిపై మండిపడింది.

అటువంటి అసత్య వార్తలు మీడియాలో సర్క్యులేట్ చేస్తే సహించను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube