మూడవ సారి పెళ్లికి సిద్దం అయిన మాజీ హీరోయిన్‌

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన విజయకుమార్‌ పెద్ద కూతురు వనిత విజయకుమార్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యి కొన్ని సినిమాలు చేసింది.కాని ఆమె లక్‌ కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది.

 Vanitha Vijay Kumar, Robert, Peter Paul, Vanitha Vijay Kumar Third Marriage Rumo-TeluguStop.com

మళ్లీ వెండి తెరపై మెరిసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.తెలుగు తమిళంలో ఆఫర్ల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఆ సమయంలోనే ఈమెకు బిగ్‌బాస్‌ తమిళంలో ఛాన్స్‌ దక్కింది.దాంతో అప్పటి నుండి ఈమె మళ్లీ మీడియాలో నిలుస్తూ వస్తోంది.

2000 సంవత్సరంలో సినీ నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకున్న వనిత ఆయన నుండి కేవలం అయిదు సంవత్సరాలకే విడిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2007వ సంవత్సరంలో వ్యాపారవేత్త అయిన ఆనంద్‌ను వివాహం చేసుకుంది.

వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది.వీరి సంసారం సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి.

దాంతో ఇద్దరు కూడా అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

Telugu Peter Paul, Robert, Vanithavijay-

ఇక కొన్నాళ్లుగా డాన్సర్‌ రాబర్ట్‌తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇంతలోనే ఈమె ఈనెల 27వ తారీకున పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పెళ్లి ఆహ్వాన పత్రిక ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.రాబర్ట్‌తో కూడా ఈమె విడిపోయిందా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇంత మందితో వ్యవహారం సాగించిన వనిత పీటర్‌తో అయినా కలకాలం జీవితాన్ని సాగించేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube