అందుకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. నిజాలు చెప్పిన వనిత...

గతేడాది మూడో పెళ్లి చేసుకోవడంతో పాటు మూడో భర్తతో విడిపోవడం ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.పెళ్లిళ్ల ద్వారా వనితా విజయ్ కుమార్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

 Vanitha Vijay Kumar Interesting Comments About Three Marriages-TeluguStop.com

అయితే మూడు పెళ్లిళ్ల గురించి గతంలో కామెంట్లు చేసిన విజయ్ కుమార్ తాజాగా తన కుటుంబ సభ్యులు పరువు కోసం తనను ఇంటి నుంచి గెంటేశారని సోషల్ మీడియాలో కూడా తనను బ్లాక్ చేశారని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దేవి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వనితా విజయ్ కుమార్ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.

 Vanitha Vijay Kumar Interesting Comments About Three Marriages-అందుకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. నిజాలు చెప్పిన వనిత…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందులకు తన కుటుంబమే కారణమని అన్నారు.తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అయితే లా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తనకు సరదా మాత్రం కాదని ఆమె అన్నారు.

అందరికీ తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాననే విషయం తెలిసినా ఆ పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణాలు మాత్రం తెలియవని 18 సంవత్సరాల వయస్సులోనే తనకు మొదటి వివాహం జరిగిందని మొదటి భర్తతో జరిగిన గొడవల వల్ల మానసిక వేదనకు గురయ్యానని ఆ తర్వాత తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వనితా విజయ్ కుమార్ అన్నారు.

ఆ తరువాత తాను లవ్ చేసిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నానని రెండో భర్తతో తాను సంతోషంగా ఉన్న సమయంలో పిల్లల పెంపకం గురించి నమోదైన కేసు వల్ల తాను రెండో భర్తకు దూరం కావాల్సి వచ్చిందని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

పేరెంట్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనను దూరం పెట్టారని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.లైఫ్ లో తగిలిన ఎదురుదెబ్బల వల్లే తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని ఆమె అన్నారు.

#VanithaVijay #Three Marriages #VanithaVijay #VanithaVijay #VanithaVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు