తీవ్ర గాయాలపాలైన వనిత విజయ్ కుమార్...బిగ్ బాస్ వల్లే దాడి జరిగిందా?

తమిళ యాక్టర్ వనిత విజయ్ కుమార్ ( Vanitha Vijay Kumar ) తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తాజాగా తనపై దాడి జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 Vanitha Vijay Kumar Had Injured Post Goes Viral ,vanitha Vijay Kumar, Injured, B-TeluguStop.com

అయితే ఇందులో ఈమె మొహంపై తీవ్రస్థాయిలో గాయాలు అయ్యాయని దెబ్బలు తగలడం వల్ల కన్ను ఫేస్ మొత్తం వాపు వచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇలా దెబ్బలు తగిలినటువంటి తన ఫేస్ ఫోటోని వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

తనపై దారుణమైనటువంటి దాడి జరిగిందని బిగ్ బాస్ ( Bigg Boss ) అనేది కేవలం ఒక గేమ్ మాత్రమేనని వైలెన్స్ కరెక్ట్ కాదు అంటూ ఈమె ఈ పోస్ట్ ని షేర్ చేశారు.దీంతో బిగ్ బాస్ కారణంగానే ఈమెపై దాడి జరిగిందా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే బిగ్ బాస్ కారణంగా తనకు గాయాలు కావడం ఏంటి అనే విషయానికొస్తే ప్రస్తుతం బిగ్ బాస్ తమిళ సీజన్ లో వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక ( Jovika ) కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా జోగికను సపోర్ట్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.అయితే హౌస్ లో జ్యోతిక ప్రదీప్ మధ్య తరచూ గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈమె ఈ విషయాలపై పోస్ట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో పట్ల ఈమె చేసే పోస్ట్ లు కారణంగానే కొందరు ఈమెపై దాడి చేశారని పలువురు భావిస్తున్నారు.

మరి నిజంగానే ఈమెపై ఎవరు దాడి చేశారు అసలు దాడి చేయడానికి కారణం ఏంటి అనే విషయాలను వనిత విజయ్ కుమార్ వెల్లడించకపోయిన ఈమె బిగ్ బాస్ పేరును ప్రస్తావనకు తీసుకురావడంతో బిగ్ బాస్ షో కారణంగానే ఈమె పై దాడి జరిగిందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube