ఆ సినిమా నిర్మాతపై కేసు పెట్టిన వాణిశ్రీ.. రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 1960, 1970 దశకములలో వరుసగా సినిమాల్లో నటించి వాణిశ్రీ నటిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి వాణిశ్రీ నటిగా కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదిగారు.

 Actress Vanishri Filed Case Against Devudu Mamaiah Producer Viajyalalitha, Case-TeluguStop.com

ఈమె అసలు పేరు రత్నకుమారి కాగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని వాణిశ్రీ తల్లి పాత్రలతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

చిన్నప్పటి నుంచి చదువు, లలితకళలపై ఆసక్తి ఉన్న వాణిశ్రీ తెలుగులో కెరీర్ తొలినాళ్లలో హాస్య పాత్రల్లో, సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించారు.

తెలుగులో హీరోయిన్ గా మరపురాని కథ వాణిశ్రీ నటించిన తొలి సినిమా.నాదీ ఆడజన్మ మూవీలో ఛాన్స్ కోసం వెళ్లినప్పుడు ఎస్ వి రంగారావు రత్నకుమారి అనే పేరును వాణిశ్రీగా మార్చారు.

అయితే చాలా సంవత్సరాల క్రితం ప్రముఖ నటి, నిర్మాత విజయలలితపై వాణిశ్రీ కేసు పెట్టారు.

తెలుగులో సొంతంగా సినిమాలను నిర్మించిన నటీమణులలో విజయలలిత ఒకరు.

Telugu Filed, Dasari Yana Rao, Devudu Mamaiah, Vijayalalitha, Shoban Babu, Tolly

దేవుడు మామయ్య పేరుతో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా విజయలలిత సినిమాను నిర్మించారు.1980 సంవత్సరం జనవరి నెల 14వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం కాగా ఫైనాన్స్ సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు.ఆ తర్వాత విజయలలిత దాసరి నారాయణరావు సహాయం కోరగా ఆయన ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

Telugu Filed, Dasari Yana Rao, Devudu Mamaiah, Vijayalalitha, Shoban Babu, Tolly

వేర్వేరు కారణాల వల్ల దేవుడు మామయ్య సినిమా ఆలస్యంగా విడుదలైంది.ఆ సినిమాకు వాణిశ్రీ పారితోషికం 80000 రూపాయలు కాగా 50,000 రూపాయలు తనకు ఇవ్వలేదని ఆ డబ్బులు ఇప్పించాలని వాణిశ్రీ విజయలలితపై కేసు వేశారు.ఆ తర్వాత విజయలలిత మళ్లీ దాసరి నారాయణరావు సహాయం కోరి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.

వాణిశ్రీకి, విజయలలితకు మధ్య రాజీ కుదిర్చి వాణిశ్రీ కేసు విత్ డ్రా చేసుకునేలా దాసరి నారాయణరావు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube