ఫలించిన కేసీయార్ వ్యూహం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వాణీదేవి.. !

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పోరు అందరికి తెలిసిందే.తీవ్ర ఉత్కంఠంగా సాగిన ఈ సమరంలో ఎవరు తక్కువ కాకుండా ప్రచారాలు చేశారు.

 Vanidevi Wins Mlc Elections, Telangana, Hyderabad, Rangareddy, Mahabubnagar, Mlc-TeluguStop.com

ఇక ఈ సారి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని గులాభి పార్టీ ఎంతగానో ఆరాట పడింది.ఇందుకు గానూ ఊహించని విధంగా ఎత్తులు వేసింది.

చివరికి మన మాజీ ప్రధాని పీవి గారి పేరును కూడా వాడుకుంది.ఎన్ని విమర్శలు వచ్చినా, బెదిరిపోకుండా తీవ్రమైన పోటీ మధ్య పీవీ గారి కూతురైన సురభీ వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది.

ఒక వైపు ప్రజల్లో టీయార్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత కనబడుతున్న సురభీ వాణీదేవీ విషయంలో అవేమి పట్టించుకోకుండా ప్రచారంలో ముఖ్యనేతలను పాల్గొనేలా ప్రణాళిక రచించి చివరికి వాణీదేవీ గారికి విజయాన్ని అందించింది.ఇకపోతే తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవీ గెలుపొందారు.

కాగా ఈ నియోజకవర్గంలో ముందు నుండి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుండగా చివరకు మాత్రం వాణీదేవీ విజయం సాధించారు.మొత్తానికి 11,703 ఓట్లతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్ధి రామచందర్ రావుపై సురభీ వాణీదేవీ గెలుపొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube