అమెరికా “తెలుగు కధ” కి ఆహ్వానం..!!!!

అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కధ పేరుతో కధా సంకలనంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించనుంది.50 ఏళ్ల ఉత్తర అమెరికా కధా సాహిత్యాన్ని ఈ కధ రూపంలో వెలువరచనుంది.అందుకు గాను రచనా ,సేకరనలని ఆహ్వానిస్తోంది.రచయితలూ , పాఠకులు తాము రాసిన లేక నచ్చిన రెండు కధల్ని ఈ పోటీలో పంపాలి.

 Vanguri Foundation Of America Inviting For Telugu Katha-TeluguStop.com

డా.వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్, టెక్సస్), డా.సి.మృణాళిని(హైదరాబాద్) దీనికి సంపాదకులుగా వ్యవహరిస్తారు.కథకుడి నివాసం, కథ ఇతివృత్తాల ఆధారంగా పరిశీలనకు వచ్చిన ఏ కథ అయినా అమెరికా కథా, కాదా అనే అంశంపై సంపాదకులదే తుది నిర్ణయం…అయితే కథా సంకలనంలో కథల సేకరణ, ఎంపికల బాధ్యత సంపాదకులదే.

ఏ కధ ప్రచురణ అయినా సరే 1964-2014 మధ్య కాలానిదై ఉండాలి.ప్రతి కథా ప్రచురించబడిన పత్రిక పేరు, సంవత్సరం, నెల, తేదీ వివరాలు తప్పనిసరి ఉండాలి.కథా ప్రచురణ వివరాలు, అనుమతి పత్రంతోపాటు ప్రతీ రచయితా తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, పది వాక్యాల లోపు జీవిత విశేషాలు, మొబైల్ , ఇ-మెయిల్ ఐ.డి పంపాలి.ఆఖరు తేదీ ఈనెల 31.పంపించాల్సిన చిరునామా vangurifoundation@gmail.com.ఫోన్ నంబర్: 8325949054.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube