వంగవీటి రాధా వైసీపీలోకి వచ్చేస్తున్నారా ?  

Vangaveeti Radha Try To Comes In Ycp Party-kodali Nani,vangaveeti Radha,vangaveeti Radha Kapu Cast Leader,vangaveeti Radha Present In Tdp Party

రాజకీయ దురదృష్టవంతుడిగా ముద్ర వేయించుకున్న వంగవీటి రాధాకృష తన తొందరపాటు, రాజకీయ పరిపక్వత లేకపోవడం తదితర కారణాలతో పొలిటికల్ కెరియర్ ను అగాధంలోకి నెట్టేసుకున్నారు.దాదాపు అన్ని పార్టీలు ఇప్పటికే చుట్టి వచ్చేసిన రాధాకృష్ణ తన నిలకడలేని తత్వంతో అన్ని పార్టీల దగ్గరా తన పరపతిని కోల్పోయాడు.

Vangaveeti Radha Try To Comes In Ycp Party-kodali Nani,vangaveeti Radha,vangaveeti Radha Kapu Cast Leader,vangaveeti Radha Present In Tdp Party Telugu Political Breaking News - Andhra Pradesh,Telangan-Vangaveeti Radha Try To Comes In YCP Party-Kodali Nani Vangaveeti Kapu Cast Leader Present Tdp Party

ఎన్నికల ముందు టికెట్ కేటాయింపులో వచ్చిన తగాదా కారణంగా వైసీపీని వదిలి టీడీపీలో చేరాడు రాధాకృష్ణ.పార్టీ అధికారంలోకి రాకపోవడంతో సైలెన్స్ అయిపోయారు.అయితే ఇప్పుడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.బెజవాడ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణ గుర్తింపు సాధించారు.

అయితే కాంగ్రెస్ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ ఇలా ఒక పార్టీ అంటూ నిలకడ లేకుండా వంగవీటి రాధాకృష్ణ దూకుడు ప్రదర్శించారు.ఒకప్పుడు ఎన్నికష్టాలు వచ్చినా, ఎన్నికల్లోలాలు ఎదురైనా కూడా వంగవీటి రంగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్నారు.అలాంటి నాయకుడి కుమారుడుగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004లో వైఎస్ అండదండలతో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు.

తర్వాత ఇప్పటి వరకు ఆయన వరుసగా ఓడిపోతూనే ఉన్నారు.అదే సమయంలో తమ పరపతిని కోల్పోయారు.

ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు.అయితే, తనకు సెంట్రల్ నియోజకవర్గం కావాలని పట్టుబట్టి, అది రాకపోవడంతో టీడీపీలో చేరిపోయారు.

ఇంత వరకు బాగానే ఉన్నాఆ తరువాత వంగవీటి రాధాకృష్ణ వ్యవహరించిన తీరు వైసీపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది.అంతేకాకుండా ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు యజ్ఞ యాగాలు కూడా నిర్వహించారు.

ఇది వైసీపీ అధినేత జగన్ కు మరింత ఆగ్రహం తెప్పించింది.ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదని అది మునిగిపోయే నావ అనే అభిప్రాయానికి రాధా వచ్చేశారు.

అందుకే వైసీపీలో చేరేందుకు రాధా తన మిత్రుడు వైసీపీ మంత్రి కొడాలి నాని ద్వారా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

Vangaveeti Radha Try To Comes In Ycp Party-kodali Nani,vangaveeti Radha,vangaveeti Radha Kapu Cast Leader,vangaveeti Radha Present In Tdp Party Related....