కోడెల చనిపోవడం మాకు సంతోషం : వంగవీటి నరేంద్ర  

Vangaveeti Narendra Comments Kodela Siva Prasad-sp Vyas,vangaveeti Narendra,vangaveeti Ranga

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మాజీ స్పీకర్‌, మాజీ మంత్రి అయిన కోడెల శివ ప్రసాద్‌ మృతితో ఆ పార్టీ నాయకులు మరియు ఆయన కుటుంబ సభ్యులు శోకంలో మునిగి పోయారు.కోడెల మృతితో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతంలో జనాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Vangaveeti Narendra Comments Kodela Siva Prasad-sp Vyas,vangaveeti Narendra,vangaveeti Ranga-Vangaveeti Narendra Comments KOdela Siva Prasad-Sp Vyas Vangaveeti Ranga

ఇక ఆయన సొంత ప్రాంతంలో పరిస్థితి చాలా గంభీరంగా ఉంది.ఏ వ్యక్తి చనిపోయినా, ఎంత శత్రువు చనిపోయినా కూడా ఎవరు కూడా సంతోషంగా ఉందని మాత్రం వ్యాఖ్యలు చేయరు.కాని కోడెల మృతి తమకు సంతోషాన్ని కలిగించిందని బీజేపీ నాయకుడు వంగవీటి నరేంద్ర అంటున్నాడు.

Vangaveeti Narendra Comments Kodela Siva Prasad-sp Vyas,vangaveeti Narendra,vangaveeti Ranga-Vangaveeti Narendra Comments KOdela Siva Prasad-Sp Vyas Vangaveeti Ranga

కోడెల మృతిపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.30 ఏళ్ల క్రితం బందరు రోడులో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి వంగవీటి మోహనరంగను అప్పటి హోం మంత్రిగా ఉన్న ఈయన ఎస్పీ వ్యాస్‌తో కలిసి చంపేశాడు.మూడు సార్లు రెక్కీ నిర్వహించి మరీ రంగాను చంపేశారు.ఆ హత్యలో కీలక భాగస్వామి అప్పటి హోం మంత్రి, ఇప్పుడు ప్రజా ప్రతినిధి, ప్రజా నాయకుడు అని పిలవబడుతున్న కోడెల అంటూ నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

ఆయన చేసిన పనికి శిక్ష అనుభవించాడంటూ నరేంద్ర కామెంట్‌ చేశారు.