చంద్రబాబు గూటికి వంగవీటి...రంగంలోకి వైసీపి నేతలు

విజయవాడ పేరు చెప్తే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రి తరువాత వంగవీటి రంగా.వంగవీటి రంగా ప్రస్థానం విజయవాడలో చెరిగిపోని చరిత్రని నిలిపేసింది.

 Vangaveeti Radha To Join Tdp..?-TeluguStop.com

ఆయన చుట్టూనే ఇప్పటికీ ఏపీ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి.అయితే వంగవీటి తనయుడు వంగవీటి రాధా జగన్ తో వైసీపి ప్రారంభ దశనుంచీ ఉన్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జగన్ కి తోడుగా నిలిచారు.జగన కి ఎంతో నమ్మకస్తుడుగా ఉన్న రాధా చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వెళ్లనున్నారు అని టాక్ నడుస్తోంది.

అసలు వివరాలలోకి వెళ్తే.

వంగవీటి రాధా వైసీపి అధినేత విషయంలో అసంతృప్తి గా ఉన్నారు అన్న విషయం గత కొంతకాలంగా తెలుస్తూనే ఉంది.

అయితే ఈ నెల 22నగాని, లేకపోతే 23వతేదీన గాని రాధ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అంటూ వైసీపినేతలకి తెలియడంతో ఆగమేఘాల మీద జగన్ రెడ్డి వైసీపి కీలక నేతలని రాధా వద్దకు పంపుతున్నారు అని తెలుస్తోంది.పొమ్మని పొగబెట్టి మళ్ళీ ఇలా బ్రతిమిలాడుకోవడం ఎందుకు అనుకుంటున్నారా.

రాధా వైసీపిని విడిచి టిడిపి వైపు చూడడు అనే ధీమా జగన్ కి ఉంది.అయితే ఈ సమయంలో రాధా కి ఉన్న సమస్యలని పట్టించుకోవక పోవడంతో తనతో నిర్లక్షంగా వ్యవహరించడంతో రాధా టిడిపిలోకి వెళ్ళే విషయంలో ఒక క్లారిటీ తో ఉన్నారు అని టాక్.

అంతే ఒక్కసారిగా వైసీపి చేపట్టే కార్యక్రమాలకి దూరంగా ఉండటం మొదలు పెట్టారు.అంతేకాదు వైసీపి నేతలు ఎవరికీ కూడా అందుబాటులోకి లేకుండా సైలెంట్ అయ్యారు కూడా దాంతో వైసీపి కూడా రాధా విషయంలో అంటీ ముత్తనట్టుగా ఉంది.

దీంతో రాధా టిడిపి నేతలతో టచ్ లోకి వెళ్ళిపోయారు.త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకోనున్నారు రాధా…ఈ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా మేల్కొన్న వైసీపి నాయకుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

రాధా వైసీపిని విడిచిపెడితే కృష్ణా జిల్లానుంచీ మొదలు అన్ని చోట్లా కాపుల ఓట్లు దూరం అయ్యే పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన వైసీపి రాధా ని బుజ్జగించే పనిలో పడింది అని తెలుస్తోంది.మరి రాధా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఉత్ఖంట ఇప్పుడు రెండు పార్టీలలో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube