చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి వంగవీటి రాదా ప్రయత్నం

కాపుల నాయకుడు వంగవీటి రంగని దొంగ దెబ్బ తీసి చంపిన పార్టీగా తెలుగు దేశం పార్టీపై కాపులలో బలమైన ముద్ర పడిపోయింది.ఇక రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఇప్పటికి చాలా మంది కాపు సామాజిక వర్గంలో నమ్ముతారు.

 Vangaveeti Radha Plan Yagam For Chandrababu-TeluguStop.com

అయితే ఇంతకాలం కాపు సామాజిక వర్గం నాయకులకి ఏపీలో కాంగ్రెస్, టీడీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకపోవడం వలన ఆ పార్టీలలో ఉండాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని కాపు సామాజిక వర్గం వారు ఓన్ చేసుకుంటున్నారు.

అయితే సామాజిక వర్గం అంతా ఒక వైపు ఉంటే సామాజిక వర్గ గౌరవానికి విరుద్ధంగా ఇప్పుడు రంగా వారసుడుగా ఉన్న వంగవీటి రాదా వ్యవహరిస్తున్నారు అనే మాట బలంగా వినిపిస్తుంది.గతంలో తన తండ్రిని చంద్రబాబు చంపాడు అని బహిరంగంగా విమర్శలు చేసిన రాదా ఇప్పుడు అదే చంద్రబాబుతో దోస్తీ కట్టి, ఎవరో కొందఱు వ్యక్తులు చేసిన తప్పుకి చంద్రబాబు కారణం చేయడం, అలాగే టీడీపీ పార్టీని తన తండ్రిని చంపినా పార్టీగా ముద్ర వేయడం సరైన పద్ధతి కాదని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు.

తరువాత టీడీపీలో అధికారికంగా చేరిపోయాడు.

టీడీపీలో అతనికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అదలా ఉంటె వైసీపీని భూస్థాపితం చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాదాని చంద్రబాబు స్టార్ కంపైనర్ గా చేస్తాడు అని అందరూ భావించారు.అయితే రాదాని ప్రచారానికి దూరంగా ఉంచిన చంద్రబాబు తానే టీడీపీకి స్టార్ కంపైనర్ గా మారి ఎన్నికల ప్రచారం మొదలెట్టాడు.

అయితే తాజాగా చంద్రబాబుని ప్రసన్న చేసుకోవడానికి, టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని రాదా ఇప్పుడు ఓ యాగం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ యంగం మూడు రోజుల పాటు వేదమంత్రోచ్చారణ మధ్య జరుగుతుందని తెలియజేసారు.

ఇప్పుడు రాదా వ్యవహారం చూసి ఏపీ రాజేకీయాలలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube