ఏపీ రాజకీయాల్లో సంచలనం వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్..!!

జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తాజాగా విజయవాడలో వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు.వీరిద్దరి భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 Vangaveeti Radha Meeting With Jansena Leader Nadendla Manohar, Vangaveeti Radha , Nadendla Manohar , Ap Poltics , Janasena, Pawan Kalyan, Tdp, Chandra Babu Naidu, Ycp, Kodali Nani-TeluguStop.com

వంగవీటి రాధా కార్యాలయంలో దాదాపు అరగంట పాటు ఏకాంతంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం జరిగింది.ఈ పరిణామంతో ఈ నెల నాలుగో తారీఖు వంగవీటి రంగా జయంతి నాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో.వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.

 Vangaveeti Radha Meeting With Jansena Leader Nadendla Manohar, Vangaveeti Radha , Nadendla Manohar , Ap Poltics , Janasena, Pawan Kalyan, Tdp, Chandra Babu Naidu, Ycp, Kodali Nani-ఏపీ రాజకీయాల్లో సంచలనం వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుమూలంగానే ముందుగా.నాదేండ్ల మనోహర్.

ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆదివారం నాడు విజయవాడ ఎన్బివికే భవన్ లో జనసేన పార్టీ తరపున “జనవాణి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్… వంగవీటి రాధాతో భేటీ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.ప్రస్తుతం రాదా టీడీపీలో ఉన్నప్పటికీ పెద్దగా యాక్టివ్ గా లేరు.

కానీ ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.గతంలో తనని హత్య చేయించడానికి రెక్కీ నిర్వహించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.ఆ టైంలో ప్రభుత్వం భద్రత కల్పించడానికి కూడా ముందుకు వచ్చింది.

కానీ రాధా తిరస్కరించారు.అనంతరం చంద్రబాబు నాయుడు.

రాధా ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.పరిస్థితులు ఇలా ఉంటే నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ.

ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube