వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఇంకా గందగోళంలోనే ఉందా ?

కాపు సామాజిక వర్గం అంతా ఆరాధించే వంగవీటి మోహన రంగా తనయుడు రాధా కృష్ణ రాజకీయ భవిష్యత్తు ఇంకా గందరగోళం లోనే ఉంది.ఇప్పటికే ఆయన మారని పార్టీ లేదు.

 Vangaveeti Radha Krishna Political Career In Suspension-TeluguStop.com

ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండకపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది.ఎన్నికల ముందు వరకు వైఎస్సార్ సీపీ లో ఉన్న రాధ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఆశించారు.

అయితే అక్కడ మల్లాది విష్ణు ఆ సీటు ఆశించడం తో జగన్ రాధను మచిలీపట్నం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు.అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాధ ఎన్నికలను ముందు టిడిపి లో చేరిపోయారు.

రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగా హత్య టీడీపీకి సంబంధం ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాధా టిడిపి గూటికి చేరడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అంతేకాకుండా తన తండ్రి మరణానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటూ ఆయన ప్రకటించడం మరింత అగ్గి రాజేసింది.

దీంతో అప్పటి వరకు ఆదరిస్తూ వచ్చిన కాపు సామాజిక వర్గం లో చీలిక మొదలైంది.

Telugu Janasenapawan, Malladhi Vishnu, Tdp Chandrababu, Vangaveetiradha, Ysrcp J

పోనీ టిడిపి లోకి వెళ్లినా ఆయన పోటీ చేశారా అంటే ఆయనకు టిక్కెట్ దక్కలేదు.కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంది.పోనీ వచ్చే ఎన్నికల నాటి కైనా రాధాకృష్ణ ఆశించినట్లుగా విజయవాడ సెంట్రల్ సీటు దక్కుతుందా అంటే అది లేదు.

ఎందుకంటే ఇప్పటికే అక్కడ పాగా వేసిన బొండా ఉమా ఆ సీటును వదులుకోరు.దీంతో చాలా కాలంగా రాధా టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఇప్పటికే ఆయన అనుచరులు సన్నిహితులు సూచించడంతో ఆయన ఆలోచనలో పడ్డారు.

Telugu Janasenapawan, Malladhi Vishnu, Tdp Chandrababu, Vangaveetiradha, Ysrcp J

కొంతకాలం క్రితం జనసేన తూర్పు గోదావరి జిల్లా మీటింగ్ ను నిర్వహించుకుంది.ఆ సమావేశానికి రాధా వెళ్లడం, అక్కడ పవన్ తో చర్చలు జరపడంతో రాధా జనసేనలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అయితే ఆయన మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు.

ప్రస్తుతం జనసేన బాగా యాక్టివ్ అవ్వడం ప్రతిపక్ష పాత్రలో వైసీపీ ప్రభుత్వం అంటే విరుచుకుపడటంతో ఆ పార్టీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం రాధా టిడిపిలో ఉండలేక, వైసీపీలోకి తిరిగి వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు.

అందుకే జనసేనలోకి వెళ్లి తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube