ఆలోచనలోపడ్డ వంగవీటి ...? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా ...?

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో పార్టీ మీద అలిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానం ఎటూ కాకుండా గందరగోళంలో పడినట్టు కనిపిస్తోంది.తాజాగా ఆయన నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరి వైసిపి మీద అనేక ఆరోపణలు చేశారు.

 Vangaveeti Radha Krishna In Dilama For Next Elections-TeluguStop.com

పనిలో పనిగా జగన్ వ్యవహార శైలి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే తన తండ్రి వంగవీటి రంగా హత్యకు… టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని… వ్యక్తులు చేసిన పనికి పార్టీతో ముడిపెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు.

దీంతో ఆయన టిడిపిలో చేరడం ఖాయమనే వార్తలు వినిపించాయి .దీనికి బలం చేకూరుస్తూ టిడిపికి చెందిన నాయకులతో మంతనాలు జరపడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

విజయవాడలో రంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో టిడిపికి అనుకూలంగానే ఆయన మాటలు కనిపించాయి.రాధ కూడా ఈ విధంగానే మాట్లాడారు.అయితే ఇప్పుడు ఆయన టీడీపీలో చేరే విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే అర్ధం అవుతోంది.అయితే రాధ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా…

తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని… విజయవాడ నగరంలో పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నదే ఆయన ఆశయమని చెప్పుకొచ్చాడు.

అయితే టిడిపిలో ఆయన చేరకపోతే… ప్రత్యామ్నాయంగా కనిపించేది జనసేన మాత్రమే.అయితే వంగవీటి రాధా కు పవన్ నుంచి ఎటువంటి ఆహ్వానం అందకపోవడం ఈ విషయంలో ఆ పార్టీ మౌనంగానే జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోంది.

ఇక రాధకు మాత్రం టిడిపి ఇచ్చిన ఆఫర్ పెద్దగా నచ్చలేదని తనకు ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడమే బెటర్ భావిస్తున్నట్టు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.అందుకే ఏ పార్టీలోనూ చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.ఈ అభిప్రాయానికి రావడానికి ముఖ్య కారణం కూడా ఉంది.విజయవాడ సెంటర్ సీటు లో ఇప్పటికే టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.

ఆయన తప్పించి ఇప్పుడు రాధకు సీటు ఇవ్వడం జరగని పని.అందుకే టిడిపి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ చేసింది.ఈ ఆఫర్ నచ్చకపోవడంతో రాధా ఇండిపెండెంట్గా బరిలోకి దిగి అందరికి షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇదే విషయమై తన ముఖ్య అనుచరులతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube