ఇప్పటి వరకూ భారత్ కి వచ్చిన ఎన్నారైలు ఎంతమందో తెలుసా..!!!  

NRIs,Vande bharath Mission, America,Indian Nris came back to India -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఎంతో మంది ప్రజలు కరోనా తో యుద్ధం చేస్తున్నారు.

 Vande Bharat Mission Indian Nri

వివిధ దేశాలలో ఉంటున్న ఎంతో మంది విదేశీయులని ఆయా దేశాలు తమ ప్రాంతాలకి తీసుకువెళ్తున్నాయి.భారత్ కూడా వందే మాతరం మిషన్ లో భాగంగా వివిధ దేశాలలో ఉంటున్న భారతీయులని ప్రత్యేక విమానాల ద్వారా వారి వారి స్వస్థలాలకి తరలిస్తోంది.

ఈ మిషన్ ని

మే 7

వ తేదీన ప్రారంభించిన భారత ప్రభుత్వం.ఇదిలాఉంటే

ఇప్పటి వరకూ భారత్ కి వచ్చిన ఎన్నారైలు ఎంతమందో తెలుసా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటి వరకూ వివిధ దేశాల నుంచీ ఇండియా కి వచ్చిన భారతీయుల సంఖ్య 5 లక్షలకి పైమాటేనని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మొత్తం కూడా రెండు నెలల్లో వచ్చారని తెలిపింది.సుమారు 137 దేశాల నుంచీ 5,3990 మందిని భారత ప్రభుత్వం తీసుకు వచ్చింది.ఇలా భారత్ కి వచ్చిన వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని పేర్కొంది.అంతేకాదు కేవలం యూఏఈ నుంచీ సుమారు 57 వేల మంది ఎన్నారైలు వచ్చారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

నేపాల్, భూటాన్ నుంచీ సుమారు 91 వేల మంది వచ్చారని , వీరందరూ రోడ్డు మార్గం మీదుగా ఇండియాకి వచ్చారని తెలిపింది.ఇదిలాఉంటే చార్టెడ్ విమానాల ద్వారా వచ్చిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని, ఎయిర్ ఇండియా విమానాల ద్వారా 1.64 లక్షల మంది రాగా కేవలం చార్టెడ్ విమానాల ద్వారా 2.30 లక్షల మంది వచ్చారని మంత్రిత్వశాఖ ప్రకటించింది.కరోనా కట్టడిలో భారత్ ఎంతో అద్భుతమైన ప్రయోగాత్మకమైన పనితీరుని ప్రదర్శించడంతో ఎన్నారైలు భారత్ తిరిగి వచ్చేయడానికి మొగ్గు చూపారని అంటున్నారు నిపుణులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vande Bharat Mission Indian Nri Related Telugu News,Photos/Pics,Images..