వందే భారత్ మిషన్ : అమెరికాలోని భారతీయులకు శుభవార్త.. ఇక ఇబ్బంది లేనట్లేనా..?  

Vande Bharat Mission 11 More Flights Indians - Telugu 2nd Phase Of Vande Bharat Mission, Govt Of India To Operate 11 More Flights From America, Vande Bharat Mission

లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే బాధితుల సంఖ్య లక్షల్లో ఉండగా.

 Vande Bharat Mission 11 More Flights Indians

కేంద్రం పంపే విమానాలు పదుల సంఖ్యలో ఉండటంతో అన్ని వైపులా విమర్శలు వచ్చాయి.అమెరికా నుంచి భారత్‌కు వచ్చేందుకు మొదటి విడతలో భాగంగా ఏడు విమానాలు, రెండో విడతలో మరో ఏడు విమానాలను కేటాయించింది.

దీంతో తమకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడపాలంటూ భారతీయులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వందే భారత్ మిషన్ : అమెరికాలోని భారతీయులకు శుభవార్త.. ఇక ఇబ్బంది లేనట్లేనా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీనిపై స్పందించిన నరేంద్రమోడీ ప్రభుత్వం మరో 11 విమానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

రెండో విడతలో భాగంగా మే 28 నుంచి జూన్ 15 వరకు వీటిని భారత్- అమెరికాల మధ్య నడుపుతున్నట్లు కేంద్రం తెలిపింది.ఎమర్జెన్సీ ఉన్న వారికి, వయసు పైబడిన వారికి, గర్భవతులకు, వీసా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి , ఓసీఐ కార్డ్ హోల్డర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇప్పటికే అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

కాగా కరోనా దెబ్బకు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్ష దాటింది.ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 28 శాతానికి పైగా అక్కడే నమోదయ్యాయి.ఇప్పటి వరకు అక్కడ 17.25 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vande Bharat Mission 11 More Flights Indians Related Telugu News,Photos/Pics,Images..