వంశీ పైడిపల్లి మీద పీవిపి ఫిర్యాదు నష్టం 21 కోట్లు     2016-12-29   21:08:46  IST  Raghu V

నిర్మాత పీవిపి మరోసారి లిగల్ విషయాల వలన వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటిదాకా బ్రహ్మోత్సవం నష్టాల విషయంలో పంపిణీదారులు ఆయన మీద ఫిర్యాదులతో ఫిలించాంబర్ చుట్టూ తిరిగితే, ఇప్పుడు ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లి మీద ఫిర్యాదు చేయడం కోసం చాంబర్ మెట్లు ఎక్కారు.

విషయంలోకి వెళ్తే, రెండు విషయాల్లో పీవిపి వంశీ పైడిపల్లి మీద అసంతృప్తి మీద ఉన్నారు పివిపి. ఒకటి, ఊపిరి సినిమా 40 కోట్లలో తీసిపెడతానని చెప్పి, వంశీ దాన్ని 65 కోట్ల దాకా తీసుకెళ్ళాడని, దాంతో తనకు 21 కోట్ల నష్టం చూడాల్సివచ్చిందని ఒక అభియోగం.

ఆ నష్టం పూరించటం కోసం, తమ పీవిపి సంస్థలో మరో సినిమా చేస్తానని చెప్పిన వంశీ, మహేష్ బాబు పీవిపితో సినిమా క్యాన్సల్ చేసుకోగానే, మహేష్ తో వెళ్ళిపోయాడని, వేరే సంస్థలో మహేష్ తో సినిమా చేసుకుంటున్నాడు, మరి తమ సంస్థలో చేయాల్సిన సినిమా పరిస్థితి ఏంటని, ఫిలిం చాంబర్ లో ఘాటుగానే ఫిర్యాదు చేశారట ఈ నిర్మాత. మరి ఈ విషయం మీద వంశీ పైడిపల్లి స్పందన ఎలా ఉంటుందో!