ఆ నిర్మాతకి లీగల్ గా బదులు ఇస్తానంటున్న వంశీ పైడిపల్లి     2017-01-05   23:34:16  IST  Raghu V

నిర్మాత పివిపి – దర్శకుడు వంశీ పైడిపల్లిలా మధ్య వైరం రోజురోజుకి మరింత పెరిగి, ఓరకంగా చెప్పాలంటే రసవత్తరంగా మారుతోంది. నిజానికి ఊపిరి తరువాత వంశీ పైడిపల్లి పివిపి సంస్థలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. బ్రహ్మోత్సవం చిత్రానికి నష్టాలు రావడంతో, మహేష్ కూడా పివిపికి మరో సినిమా చేస్తానని భరోసా ఇచ్చాడు.

కాని ఏవో వ్యక్తిగత విషయాల వలన మహేష్ ప్రాజెక్టు నుంచి వెళ్ళిపోయి, పీవిపి ఇచ్చిన అడ్వాన్స్, బ్రహ్మోత్సవం చిత్రానికి తనవంతు నష్టపరిహారం, వడ్డితో సహా చెల్లించేసిన సంగతి తెలిసిందే. మహేష్ మీదే ఆశలు పెట్టుకున్న వంశీ పైడిపల్లి, మహేష్ తోపాటే పివిపి డీల్ నుంచి బయటకి వెళ్లిపోయాడు.

అప్పుడు సడెన్ గా, వంశీ వలన ఊపిరి చిత్రం విషయంలో 21 కోట్లు నష్టపోయాయని, ఇప్పుడు వంశీ తనతో సినిమా చేయట్లేదని ఫిలిం చాంబర్‌లో పిపివి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఆ విషయం మీద ఇప్పుడు స్పందించాడు దర్శకుడు వంశీ. ఊపిరి చిత్రానికి తన వలన నష్టాలు రాలేదని, సాటిలైట్ కలుపుకోని నిర్మాత లాభాలే చూసాడని, తనపై చేసిన అబద్ధపు ఆరోపణలపై లీగల్ గా బదులిస్తానని చెప్పుకొచ్చాడు వంశీ.

ఇద్దరు కత్తులు దూస్తున్నారు. ఇక ఈ గొడవ ఇంకెన్ని మలుపులు తిరిగుతుందో, కథ చివరకి ఎలాంటి అంతాన్ని చూస్తుందో వేచి చూడాల్సిందే.