'మహర్షి' శృతి మించింది  

Vamshi Paidipally Puts Too Much Budget On Mahesh Babu Maharshi Movie-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహర్షి’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ఈ చిత్రం విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించాడు.

Vamshi Paidipally Puts Too Much Budget On Mahesh Babu Maharshi Movie-

ఒక్కో సీన్‌ను మూడు నాలుగు వర్షన్‌లలో తెరకెక్కించాడు.తీరా చూస్తే సినిమా బడ్జెట్‌ హద్దులు దాటిపోయింది.ఒక తెలుగు సినిమ 100 కోట్ల బడ్జెట్‌ అంటేనే అది చాలా ఎక్కువ, రాజమౌళి వంటి దర్శకులు ఎన్ని కోట్లు పెట్టినా నడుస్తుంది.కాని వంశీ పైడిపల్లి వంటి దర్శకుడు ఏకంగా 130 కోట్లకు పైగా ఈ చిత్రం కోసం ఖర్చు చేయించాడట.

ఇప్పుడు సినిమా నిర్మాతలు గుండెలు బాదుకుంటున్నారు.

Vamshi Paidipally Puts Too Much Budget On Mahesh Babu Maharshi Movie-

నిర్మాణ సమయంలో ముగ్గురు నిర్మాతలు పెడుతూ పోయారు.ఇప్పుడు సినిమాకు బడ్జెట్‌ హద్దులు దాటడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు.అన్ని హక్కులు అమ్మినా కూడా సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

సినిమా సూపర్‌ హిట్‌ అయ్యి వంద కోట్ల కలెక్షన్స్‌ రాబడితేనే అప్పుడు నిర్మాతలు సేఫ్‌ జోన్‌లో పడ్డట్లు.ఎంత సూపర్‌ హిట్‌ అయినా కూడా నిర్మాతలకు మాత్రం లాభాలు రావడం అనేది చాలా అరుదుగా చెబుతున్నారు.

మహేష్‌బాబు 25వ సినిమా అవ్వడంతో రాజీ పడవద్దని అంతా భావించి మరీ ఇంత దారుణంగా సినిమాను చేయడం జరిగింది.మహేష్‌బాబు 130 కోట్ల బడ్జెట్‌ పోయే వరకు ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంత బడ్జెట్‌ ముగ్గురు నిర్మాతలు కాబట్టి పర్వాలేదు, అదే ఒక్క నిర్మాత అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

.

తాజా వార్తలు

Vamshi Paidipally Puts Too Much Budget On Mahesh Babu Maharshi Movie- Related....