వామ్మో.. ఎంత పెద్ద కీర దోస కాయలో..!

కీరదోస ఎంతో మేలు చేస్తుంది.ఇది వేసవి వేడిని మన శరీరంలో తగ్గించడంలో ఎంతో తోడ్పడుతుంది.

 Vammo What A Big Spinach Cucumber 3 Foot,cucumber, Peddapalli,telangana, Viral P-TeluguStop.com

కీరోదోస ఎంత తిన్నా అది జీర్ణం అవుతుంది.జీర్ణవ్యవస్ద మెరుగుపడుతుంది.

కీరదోసలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి.కీరదోస రీహైడ్రేటింగ్ ఏజంట్‌గా పని చేస్తుంది.

కీరదోస మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.ఇందులో పోటాషియం మెగ్నిషియం అధికంగా ఉంటాయి.

ఇది రక్తపోటును తగ్గిస్తుంది.సాధారణంగా కీరదోసను చాలా మంది రైతులు పండిస్తూనే ఉంటారు.

అయితే ఈ కీరదోస సీజన్లతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఇది బాగా పని చేస్తుంది.

కీరదోసకాయ సాధారణంగా చాలా చిన్న సైజుతో పండుతుంది.కొన్ని అయితే కాస్తా పెద్దవిగానే ఉంటాయి.అయితే ఇప్పుడు మూడు అడుగుల కీరదోస కాసిది.ప్రస్తుతం ఆ కీరదోసను చూడటానికి చాలా మంది వస్తున్నారు.

3 అడుగుల కీరదోస అందర్నీ ఆకట్టుకోవడం విశేషం.ఆ కీరదోసను చూసేందుకు చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు.

ఈ కీరదోస పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు పండించాడు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల అనే ఊరిలో ఈ అతి పెద్ద పొడవుగల కీరదోస కాయలు కాశాయి.

పూసాల గ్రామానికి చెందిన కనుకుంట్ల రాజయ్య విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు.అయితే, తన ఇంటి వద్ద ఖాళీ స్థలంలో కీరదోస విత్తనాలు నాటారు.

Telugu Cucumber, Padapalli, Peddapalli, Telangana, Inernet-Latest News - Telugu

అలా ఆయన రైతుగా మారి ఈ కీరదోసను పండించాడు. ప్రస్తుతం కీర దోసకాయలు ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు ఫీట్ల పొడుగు ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడి చేరుకుంటున్నారు.ఒక్కో కాయ మూడు నుంచి నాలుగు కిలోల బరువుతో ఉండంటంతో రాజయ్యను అందరూ మెచ్చుకుంటున్నారు.ఇలాంటి అరుదైన దోస కాయను ఇంతవరకు చూడలేదని, పెద్దసైజ్‌లో పండిన కీరాదోసకాయలు చూస్తుంటే సంతోషంగా ఉందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube