వామ్మో: ఆ విస్కీ బాటిల్ ధర కోటి.. అసలు స్టోరీ ఏంటంటే..?!

సస్పెన్స్ త్రిల్లర్ సినిమాల్లో హీరోకు ఒక చిన్న వస్తువు ‘క్లూ’ లాగా దొరుకుతుంది.ఆ వస్తువు ఎవరిది.

 The Price Of That Whiskey Bottle Is Crore  What Is The Real Story  Viral Latest-TeluguStop.com

ఎక్కడ నుండి వచ్చింది ఇక్కడికి ఎవరూ తీసుకొచ్చారని దానిపై మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు.దాని కనుక్కునే ప్రాసెస్ లో సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఒక్క రేంజ్ లో ఊహకు అందని రీతిలో ఉంటాయి.

ఒక్క క్ల తో ఒక్కొక్క సమాధానం సంపాదిస్తూ హీరో ఎలాగోలా ఫజిల్ ని సాల్వ్ చేసి ఆ వస్తువు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటాడు.ఇంచు మించు అలాంటి కథ తోనే ఓ వస్తువు ముందుకు వచ్చింది.

అదేదో వాచ్, పేపర్ కాదండోయ్.అది ఒక విస్కీ బాటిల్.

అవును మీరు విన్నది నిజమే.

ఇంగ్లండ్ లోని ప్రముఖ వేలం సంస్థ స్కిన్నర్ ఇంక్ అతి పురాతనమైన విస్కీ బాటిల్ ని వేలం వేసింది.

అది ప్రపంచంలోనే అతి పురాతనమైన బాటిల్.ఈ విస్కీ బాటిల్ కి 20-40 వేల డాలర్లు వస్తాయని వేలం సంస్థ భావించింది.

కానీ జూన్ 30తో ముగిసిన వేలంలో మిడ్ టౌన్ మన్హాటాన్ లోని మ్యూజియం పరిశోధన సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ సుమారు కోటి రూపాయలకు పైగా చెల్లించి దీన్ని సొంతం చేసుకుంది.

Telugu Bottle, Oldest Whiskey, Crore, Story, Latest-Latest News - Telugu

అయితే ఈ బాటిల్ వెనుక ఉన్న ఒక లేబుల్ లో ఒక విషయం రాసి ఉందిఈ బౌర్బన్ బహుశా 1865కి ముందే తయారు చేసి ఉండవచ్చు.మిస్టర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్ గదిలో ఇది కనిపించింది.అతడు మరణించిన తరువాత వారి ఎస్టేట్ నుండి సంపాదించడం జరిగింది అని ఉంది.

అసలు ఈ విస్కీ బాటిల్ కథ ఏంటంటే దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నేష్ 1955లో పదవీ విరమణ చేశాడు.అప్పుడు ఈ విస్కీ బాటిల్ ను తన ఫ్రెండ్ ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్ కు ఇచ్చాడు.అతడు దానిని మూడు తరాల పాటు దాచి పెట్టాడు.ఆ తరువాత అది చేతులు మారుతూ మ్యూజియంకు చేరింది.

అప్పటి బాటిల్ ని ఇప్పుడు వేలం వేశారు అన్న మాట.

Telugu Bottle, Oldest Whiskey, Crore, Story, Latest-Latest News - Telugu

ఇది బహుశా 1763-1803ల మధ్య ఉత్పత్తి అయ్యి ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఆ కాలంలో వాడే బాటిల్ మోడల్ లాగే ఈ బాటిల్ ఉన్నట్టు పలువురు అభిప్రాయ పడుతున్నారు.అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఈ విస్కీ బాటిల్ లోని విస్కీ తాగడానికి ఏమాత్రం పనికి రాదు.

సాధారణంగా మూత తీయకుండా ఉంచిన విస్కీ బాటిల్ లోని విస్కీ పదేళ్ల లోపు ఉపయోగించాలి.కానీ ఇది వందేళ్ల క్రితం నాటిది.మరి ఈ కోటి పెట్టి కొన్న ఈ బాటిల్ తో పరిశోధకులు ఏం కనిపెడతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube