వామ్మో.. ఆ గదిలోని వస్తువులను ఖాళీ చేయిస్తుండగా పెట్టెలో మనిషి అస్థిపంజరాలు..! చివరకు..?!

ఉండడానికీ సొంత ఇల్లు లేకపోతే చాలామంది అద్దె గృహాలలో అద్దెకు ఉంటూ ఉంటారు.అయితే నెల నెల అద్దె అనేది ఆ ఇంటి యజమానికి సక్రమంగా చెల్లిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

 Vammo The Man Skeletons In The Box While Emptying The Objects In That Room Final-TeluguStop.com

కానీ, అద్దె అనేది సకాలంలో చెల్లించకుండా, నెలలు తరబడి కట్టకుండా ఉంటే ఎవరన్నా ఏమి చేస్తారు.సామాన్లు మొత్తం తీసేసి ఇంట్లో నుంచి బయటపడేసి ఇల్లు కాళీ చేయమంటారు.

అలా గదిని కాళీ చేయించే క్రమములో అనుకోని అతని పెట్టెలో మనిషి అస్థిపంజరం ఒకటి బయటపడింది.అది చూసి అందరూ షాక్ అయ్యారు.

అసలు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని బోరబండ ఇందిరానగర్ ప్రాంతం ఫేజ్-2 లో దేవస్థానం సెల్లార్ లో కాళీ గా ఉన్న గదులను అద్దెకు ఇస్తుంటారు.ఓ వ్యక్తి అలాగే ఆ దేవస్థానం సెల్లార్ లోని ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు.

మొదట్లో అద్దెను సక్రమంగానే కట్టేవాడు.కానీ కొద్ది నెలలుగా ఆ గదికి అద్దెను కట్టడం మానేశాడు.

నెలలు గడుస్తున్నా కొద్ది అద్దె కట్టకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.పోలీసుల సమక్షంలోనే ఆ గదిలోని వస్తువులను ఖాళీ చేయిస్తుండగా ఓ పెట్టెలో మనిషి అస్థిపంజరాలు బయటపడ్డాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017వ సంవత్సరం డిసెంబర్ నెలలో గాయత్రీ హిల్స్ కు చెందిన పలాష్ పాల్ అనే వ్యక్తి ఆ గదిని అద్దెకు తీసుకున్నాడు.పలాష్ పాల్ కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు.

అయితే అతనికి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ పెళ్లి అయిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది.తమ బంధానికి ఆమె భర్త అడ్డు వస్తున్నాడని భావించి గతేడాది జనవరి నెలలో అతడిని కడతేర్చాడు.

శవాన్ని ఎలా మాయం చేయాలో తెలియక అద్దెకు తీసుకున్న గదిలోనే ఓ పెట్టెలో అతడి శవాన్ని ఉంచాడు.తరువాత గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత రెండు నెలలు గదికి అద్దె చెల్లించాడు.తర్వాత అద్దె చెల్లించడం మానేశాడు.ఈలోపు కరోనా వచ్చింది కదా అని అద్దె అడగలేదు.కానీ, ఎంతకూ అద్దె చెల్లించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో దేవస్థానం చైర్మన్ యాదయ్య ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బుధవారం పోలీసుల సమక్షంలో ఆ గదిని ఖాళీ చేయిస్తుండగా ఓ పెట్టెలో అస్తిపంజరం కనిపించడంతో ఈ వ్యవహారం అంతా బయట పడింది.

దీంతో ఆ గదిని అద్దెకు తీసుకున్న పలాష్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తన భర్త కనిపించడం లేదంటూ ఆ మహిళ 2020వ సంవత్సరం జనవరి 11న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.పలాష్ తో కలిసే ఆ మహిళ భర్తను చంపించిందా ? లేక తన ప్రమేయం లేకుండా పలాష్ ఒక్కడే చంపడా అనేది విచారణలో తేలాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube