వామ్మో ఆ కుక్క ఆస్థి అన్ని కోట్ల..!?

మనుషుల కన్నా జంతువుల పట్ల కాస్త ఆదరణ చూపిస్తే చాలు అవి మన పట్ల జీవితాంతం విశ్వాసంతో ఉంటాయి.అయితే ఈ విశ్వాసం మిగతా జంతువుల పట్ల ఎలా ఉన్నాగాని కుక్కల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

 Vammo That Dog Property All Crores Dog, 36 Crores, Property, Viral, Social Meida-TeluguStop.com

అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.మరి కొందరైతే కుక్కలను వాటి కుటుంభ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు.

అయితే ఒక యజమాని తన కుటుంభ సభ్యులతో పాటు తాను పెంచుకునే కుక్కకి కూడా ఆస్తిలో వాటా ఇచ్చాడు.

అసలు వివరాల్లోకి వెళితే అమెరికాలోని టేన్నసీ కి చెందిన బిల్‌ డోరిస్‌(84) అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.

అతనికి ట్రావేలింగ్‌ చేయడం అనేది చాలా ఇష్టం అవ్వడంతో తరచుగా ప్రయాణాలు చేసేవాడు.ఆ సమయంలో తన పెంపుడు కుక్క అయిన లులు ని తన స్నేహితుడు మార్త్ బర్టన్‌ వద్ద వదిలేసి వెళ్ళాడు.

అయితే గతేడాది కుక్క యజమాని డోరిస్‌ మరణించాడు.అప్పటి నుంచి లులు బాధ్యతని మార్టనే తీసుకున్నాడు.అయితే కొద్ది రోజుల క్రితం చనిపోయిన డోరిస్‌ లాయర్‌ అతను చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్టన్‌కి అందించాడు.

ఆ వీలునామా చదివి మార్టాన్ షాక్ అయ్యాడు.

అందులో డోరిస్‌ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్‌ డాలర్ల ఆస్తి రాశాడు.తాను రాసిన ఆస్తిని లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం వాడాలని, లులు బాధ్యతని తన స్నేహితుడు మార్టన్‌ తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్‌.

ఈ సందర్భంగా మార్టన్‌ మాట్లాడుతూ డోరిస్‌, లులు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్లు.లులు ని తన బిడ్డలానే చూసేవాడు అని తెలిపారు.

లులు కి రాసిన ఆస్థి మన కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు.నిజంగానే డోరిస్ గ్రేట్ కదా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube