వామ్మో.. లేడీస్ హాస్టల్ లో చిరుత.. వెళ్ళిపోయే ముందు ఏం చేసిందంటే..

వన్యప్రాణులు దారి తప్పి పెద్ద నగరాల్లో కి ఎంటర్ అవుతున్నాయి.ఇప్పటికే చాలా వన్యప్రాణులు తదితర ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యి జనాలను భయబ్రాంతులకు గురి చేశాయి.

 Vammo Leopard In Ladies Hostel What Did He Do Before He Left, Women Hostels, Chi-TeluguStop.com

తాజాగా కర్ణాటక లోని బెంగుళూరు లో కూడా ఒక చిరుతపులి డాక్టర్స్ క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.బుధవారం నాడు చామరాజనగర్ జిల్లాలోని చామరాజనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్టల్లోకి చిరుత పులి దూరింది.

అయితే ఈ చిరుతపులి లేడీస్ హాస్టల్ లో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేశారు.

అయితే ఈ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.వైరల్ ఐన వీడియో లో చిరుత పులి లేడీస్ హాస్టల్ లో కి దూకి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది.

అయితే కారిడార్ లో అటూ ఇటూ తిరిగి ఆ తరువాత చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది.అయితే ఫస్ట్ ఫ్లోర్ లోకి దూరిన చిరుతపులి పారిపోవడానికి గదుల్లోకి తొంగి చూసింది కానీ అర్ధరాత్రి సమయం కావడంతో విద్యార్థులు అందరూ తలుపులు వేసుకొని పడుకున్నారు.

దీంతో ఆ చిరుతపులి విద్యార్థులున్న గదిలోకి దూరలేకపోయింది.అలాగే కారిడార్ లో ఎవరైనా ఉన్నట్లయితే వారిపై చిరుతపులి కచ్చితంగా దాడి చేసేది.అయితే వైరల్ అయిన వీడియో పై స్పందించిన కాలేజీ యాజమాన్యం చిరుత రాత్రి సమయంలో ప్రవేశించింది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చింది.

ఈ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎం సంజీవ్ మాట్లాడుతూ క్యాంపస్ టైగర్ రిజర్వ్ కి దగ్గరలో ఉంది కాబట్టి చిరుతపులులు తమ క్యాంపస్ వైపు అడపాదడపా వస్తాయని ఆయన అన్నారు.2019వ సంవత్సరంలో ఒక చిరుత పులి చామరాజనగర్ ప్రాంతంలోనే నానా బీభత్సం సృష్టించింది.ఏది ఏమైనా అడవులు కుచించుకుపోవడం తో వన్యప్రాణులు జనాలు నివసిస్తున్న నగరాల్లో కి వస్తున్నాయి.సింహాలు, పులులు, ఎలుగుబంట్లు అడవి నుంచి జనారణ్యంలోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వన్యప్రాణులు తల దాచుకోవడానికి అడవులను సంరక్షించడం ఎంతైనా అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube