వామ్మో, ఇంత చిన్న గేమ్ కన్సోల్ ఎప్పుడైనా చూశారా..?

సాధారణంగా గేమ్స్ కన్సోల్ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది.అయితే తాజాగా ప్రపంచంలోనే అత్యంత చిన్న గేమ్స్ కన్సోల్ రూపొందించారు.

 Vammo Have You Ever Seen Such A Small Game Console, Smallest Game Console, Game-TeluguStop.com

దీని పేరు థంబీ కాగా.దీని సైజు దాదాపు ఒక పోస్టల్ స్టాంప్ అంత ఉంటుంది.

కేవలం ఒక అంగుళం పొడవు ఒక అంగుళం వెడల్పు ఉండే ఈ గేమ్స్ కన్సోల్ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.దీన్ని అమెరికన్ ఇంజనీర్లు తయారు చేశారు.

ఒహయో రాష్ట్రంలోని టైనీ సర్క్యూట్ అనే ఓ చిన్న కంపెనీ ఈ కన్సోల్ సర్క్యూట్స్ డెవలప్ చేసింది.

ఇందులో ఐదు గేమ్స్ ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఇచ్చారు.

అందరికీ ఫేవరెట్ అయిన స్నేక్, టెట్రిస్, స్పేస్ ఇన్వేడర్స్ వంటి క్లాసిక్ ఆర్కేడ్ గేమ్స్ ఇందులో అందించారు.కేవలం ఐదు గేమ్స్ మాత్రమే కాకుండా యూజర్లు మైక్రోపైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి సొంతంగా కొత్త గేమ్స్ అభివృద్ధి చేయవచ్చు.

కేబుల్ సాయంతో మల్టీప్లేయర్ గేమ్స్ ఆడుకోవచ్చు.దీని బేసిక్ గ్రే మోడల్ ధర 19 డాలర్లు.అంటే మన కరెన్సీలో సుమారు రూ.1450.అయితే లింక్ కేబుల్స్, ఇతర యాక్సెసరీలు కలిపితే ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది.గేమ్ కన్సోల్‌లో 2ఎంబీ స్టోరేజ్, 72×40 మోనోక్రోమ్ OLED స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు.

అలాగే 40 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు కన్సోల్ ఛార్జింగ్‌ కోసం బజర్, గేమ్ ప్లే బటన్, పవర్ స్విచ్, మైక్రో-USB పోర్ట్‌ అమర్చారు.కీచైన్ కు జోడించేందుకు దీనికి దిగువ భాగంలో ఒక చిన్న రంధ్రం కూడా ఇచ్చారు.

థంబీ గేమ్స్ కన్సోల్ 4.7 గ్రాముల బరువుతో చాలా తక్కువ సైజ్ ఉన్నప్పటికీ.సాధారణ కన్సోల్ లాగానే పనిచేస్తుంది.ఇందులో గొప్ప ప్రాసెసర్ ‘RP2040’ అమర్చినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.దీంతో రెండు గంటలపాటు గేమ్స్ నిరంతరాయంగా ఆడుకోవచ్చు అని అంటున్నారు.ఇప్పటికే ఈ కన్సోల్‌ను కొందరు గేమర్స్ టెస్ట్ టెస్ట్ చేసి ఆ టెస్టింగ్ వీడియోలను నెట్టింట షేర్ చేశారు.

అయితే ఇందులో గేమ్స్ ఆడుకోవడం సాధ్యపడుతుందని తెలుస్తోంది.ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ అతిచిన్న గేమ్ కన్సోల్‌ను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని యూఎస్ ఇంజినీర్ బెన్ రోజ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube