వామ్మో.. టీ-20 లలో తొలి డబుల్ సెంచరీ నమోదు..!

తాజాగా టి20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన తొలి డబుల్ సెంచరీ నమోదు అయ్యింది.ఈ డబుల్ సెంచరీ నమోదు అవ్వడానికి క్రికెటర్ సుబోధ్ భాటి కారణం.క్రికెటర్ సుబోధ్ భాటి కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులను తీసి సరికొత్త చరిత్రను నెలకొల్పాడు.20 ఓవర్ల ఫార్మెట్ లో అత్యధిక పరుగులు తీసిన మొదటి భారత క్రికెటర్ గా పేరును సొంతం చేసుకున్నాడు.దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక క్లబ్ మ్యాచ్ లో ఢిల్లీ ఎలెవన్ టీం తరఫున ఆడిన సుబోధ్ భాటి ప్రత్యర్థి జట్టుపై ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.ఈ ఇన్నింగ్స్ లో సుబోధ్ భాటి భాగంగా మొత్తంగా 17 సిక్సర్లు ,17 ఫోర్లు ఉండడం గమనించవలసిన విషయం.

 Vammo First Double Century Record In T20s  Delhi Cricketer , Subodh Bhati , Scor-TeluguStop.com

ఈ తరుణంలో రాంచి ఆటగాడు కేవలం 17 బంతుల్లోనే 100 పరుగులు సొంతం చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయం.మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లు 256 పరుగులను సొంతం చేసుకుంది.

మ్యాచ్ లో భాగంగా టీం సభ్యులు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి 6 పరుగులు చేశాడు.ఇలా ఉండగా గతంలో టి20 చరిత్రలో అత్యంత వ్యక్తిగత స్కోరును సొంతం చేసుకున్న రికార్డు లలో క్రిస్‌ గేల్‌ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Sixes, Delhi Cricketer, Double Century, Ups, Subodh Bhati, Game-Latest Ne

2013 ఐపీఎల్ సీజన్ లో భాగంగా క్రిస్‌ గేల్‌ పూణే వారియర్స్ పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులను సొంతం చేసుకున్నాడు.అనంతరం ట్రై-సిరీస్‌ లో జింబాబ్వే పై ఆరోన్‌ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు తీసి తర్వాతి స్థానంలో నిలిచాడు.సుబోధ్ భాటి క్రికెట్ కెరీర్‌ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ లలో ఢిల్లీకు ప్రాతినిధ్యంగా వ్యవహరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube