కొన్ని రకాల సంఘటనలు చూసినప్పుడు మాట్లాడడానికి మాటలు ఉందని పరిస్థితి ఉంటుంది.ఏం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే అది వారి వెర్రితనం అనుకోవాలో, లేకపోతే అవగాహనా రాహిత్యమని అనుకోవాలో తెలియదు.అంతలా ఒక్కసారిగా మనుషులను అవాక్కయ్యేలా చేస్తుంది.
ఇక అసలు విషయం లోకి వస్తే మన చుట్టు ప్రక్కల ఏమైనా జరిగితేనే మనం మన ఇంటి పట్ల అప్రమత్తంగా ఉంటాం.కాని మీరు ఈ ఫొటోలో చూస్తున్న ఈ మహిళ తన ఇల్లు తగలబడుతున్నా అసలు ఏం జరగడం లేదన్నట్టు ఎంచక్కా ఎలా చోద్యం చూస్తుందో కదా.
ఇక ఇరుగు పొరుగు వారితో గొడవలు అనేవి మనం చాలా చూస్తూ ఉంటాం.మనం ఈ వీడియోలో చూస్తున్న గెయిల్ మెట్ వాలీ అనే మహిళ తన ఇరుగుపొరుగు వారితో గొడవపడి ఆ కోపంతో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నిప్పంటించి తీరిగ్గా వచ్చి పుస్తకం చదువుతోంది.
అప్పటికే ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడని, అతను బేస్ మెంట్ కిటికీలో నుండి అరుస్తున్నా ఈ మహిళ అతను అరుపులను ఏ మాత్రం పట్టించుకోకుండా పుస్తకం చదువుతున్న మహిళ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.