వల్లభనేని వంశీ ఎన్టీఆర్ ని మోసం చేశాడు.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్?

Vallabhaneni Vamsi Mohan Cheated Junior Ntr Over Land Issue Says Tdp Leader

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో హాట్ టాపిక్ గా నిలిచాయి.రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా నిలుస్తున్నాయి.

 Vallabhaneni Vamsi Mohan Cheated Junior Ntr Over Land Issue Says Tdp Leader-TeluguStop.com

ఈ క్రమంలోనే టిడిపి నేత పట్టాభి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి.పట్టాభి మాటల పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు కార్యకర్తలు టిడిపి ఆఫీసుల పై దాడి చేశాయి.

ఈ క్రమంలోనే వీటిని నిరసిస్తూ టిడిపి ప్రభుత్వం దీక్ష చేస్తోంది.ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కొడాలి నాని వల్లభనేని వంశీ ఎంతో చనువుగా ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే.

 Vallabhaneni Vamsi Mohan Cheated Junior Ntr Over Land Issue Says Tdp Leader-వల్లభనేని వంశీ ఎన్టీఆర్ ని మోసం చేశాడు.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా వరుస ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరిపై మరొకరు అధికార -ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా టిడిపి నేత సూర్య ప్రకాష్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కొడాలి నాని వల్లభనేని వంశీ రాజకీయాలలోకి రాకముందు నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరూ నిర్మాతలుగా ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

అయితే వల్లభనేని వంశీ ఒకప్పుడు టిడిపి నేత పరిటాల రవి దగ్గర పని చేసే వాడని అతని మరణాంతరం అతని ఆస్తులన్నింటినీ దోచుకున్నారని ఆరోపించారు.అలాగే ఒక ల్యాండ్ విషయంలో వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా మోసం చేశాడని ఈ సందర్భంగా టిడిపి నేత సూర్యప్రకాష్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube