దుత్త రామచంద్రరావు తో భేటీ అయిన వంశీ  

Vallabhaneni Vamsi Meet Ycp Leader Dutta Ramachandrarao-vallabhaneni Vamsi

గత కొద్దీ రోజులుగా టీడీపీ నేత వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఇంకా ఆయన నుంచి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ వంశీ వైసీపీ లో చేరుతున్నట్లు మాత్రం విపరీతంగా ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో తాజాగా వల్లభనేని వంశీ వైసీపీ నేత దుత్త రామచంద్రరావు తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.వైసీపీ నేత దుత్త వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు కూడా కావడం తో వంశీ ఆయన తో భేటీ అవ్వడం తో ఇక అధికారికంగా వంశీ వైసీపీ చేరిపోనున్నారు అన్న అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.

Vallabhaneni Vamsi Meet Ycp Leader Dutta Ramachandrarao-vallabhaneni Vamsi Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Vallabhaneni Vamsi Meet YCP Leader Dutta Ramachandrarao-Vallabhaneni

గత కొద్దీ రోజులుగా టీడీపీ పార్టీ పై అసంతృప్తి తో ఉన్న వంశీ ఈ క్రమంలో ఆ పార్టీ పై కొన్ని విమర్శలు కూడా చేశారు.అంతేకాకుండా ఆ పార్టీ లో లోకేష్ తీరు పై కూడా వంశీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.ఈ క్రమంలో వంశీ త్వరలో టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీ జెండా కప్పుకోనున్నారు అంటూ తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే తాజాగా దుత్త తో వంశీ భేటీ అవ్వడం తో ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.మొత్తానికి వైసీపీ లో చేరడానికి వంశీ తనదైన శైలి లో పావులు కదుపుతూ మెల్లిగా అడుగులువేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

అయితే ఈ భేటీ లో ఏ అంశం పై ఇరువురి మధ్య చర్చ జరిగింది అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు.