చంద్రబాబు భార్యకి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ..!!

Vallabhaneni Vamsi Apologizes To Chandrababus Wife

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ని ఉద్దేశించి బూతులు మాట్లాడారని.టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు విమర్శలు చేయటం తెలిసిందే.

 Vallabhaneni Vamsi Apologizes To Chandrababus Wife-TeluguStop.com

అంతేకాకుండా చంద్రబాబు ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి.  అసలు ఇంటిలో  నుండి కూడా బయటకు రాని.

నా భార్యని రాజకీయాల్లోకి లాగి  ఆమెపై విమర్శలు చేస్తున్నారు అంటూ మీడియా ముందు బోరున ఏడ్చారు.రాజకీయాలలో సీనియర్ కావడంతో.

 Vallabhaneni Vamsi Apologizes To Chandrababus Wife-చంద్రబాబు భార్యకి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రబాబు ఏడవడం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.ఇదే సమయంలో వల్లభనేని వంశీ కూడా కొద్దిగా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఒక సామాజిక వర్గం నుండి వల్లభనేని వంశీ పై తీవ్రస్థాయిలో.చంద్రబాబు సతీమణి విషయంలో విమర్శలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా.వల్లభనేని వంశీ చంద్రబాబు భార్య భువనేశ్వరికి సారీ చెప్పారు.పొరపాటున భువనేశ్వరి గారిపై వ్యాఖ్యలు చేయడం జరిగినది, ఎమోషనల్ లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవం.దానికి క్షమాపణ కోరుతున్నాను.

నేను చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్న.తెలుగుదేశం పార్టీలో అందరి కంటే ఆత్మీయురాలు భువనేశ్వరిగారు.

నేను అక్క అని పిలుస్తాను అని స్పష్టం చేశారు.అయితే నేను క్షమాపణ చెప్పినది కులం నుంచి వెలి వేస్తారు అన్న భయంతో కాదు.

మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.ఇదే రీతిలో చంద్రబాబునీ కూడా క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు.

తప్పు జరిగినందుకు క్షమాపణ కోరుతున్నాను.ప్రతి ఒక్కరు ఈ విషయంలో సంమయనం పాటించాలని.

ఇంకోసారి ఇటువంటి తప్పు జరుగదని ఆత్మసాక్షిగా.క్షమాపణ చెబుతున్నాను అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో వల్లభనేని వంశీ వివరణ ఇచ్చారు.

#Chandrababu #Bhuvaneswari #Potics #TDP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube